Secunderabad railway station: సైన్యంలో అగ్నిపథ్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం భారీగా విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ప్రత్యక్ష్యంగా రూ.12 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సికింద్రాబాద్ రైల్వే జోన్ ప్రాంతీయ మేనేజర్ గుప్తా వెల్లడించారు. అయితే.. ఈ అల్లర్లలో పెను ప్రమాదం తప్పినట్లు ఆయన వివరించారు. పవర్ కార్ (డీజిల్ ట్యాంకర్) కు భారీ ప్రమాదం తప్పిందని.. దానికి మంటలు అంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదంటూ ఏకే గుప్తా ఆవేదన వ్యక్తంచేశారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రైలు సర్వీసులు రద్దు చేసిన కారణంగా.. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
అల్లర్లలో రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి పూర్తిగా ధ్వంసం అయిందని గుప్తా పేర్కొన్నారు. అల్లర్ల ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతంగా జరుపుతున్నాయని వెల్లడించారు. ఈ విధ్వంసంలో 5 రైలు ఇంజిన్లు (లోకో మోటార్స్), 30 రైలు బోగీలు, పార్శి్ల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయినట్లు వివరించారు. ఆందోళనకారులను అదుపుచేయడంతో పవర్ కార్ (డీజిల్ ట్యాంకర్)కు భారీ ప్రమాదం తప్పిందనన్నారు. ప్రస్తుతం అన్ని గూడ్స్ రైళ్లను పునరుద్ధరించావతీ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుప్తా పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..