Telangana: ఆస్తి తగాదాలో తల్లిపై దాడి చేసిన కొడుకు.. చివరికి జరిగిందిదే..

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలో గంగరాజు అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు లక్ష్మణ్ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లగా.. చిన్న కుమారుడైన గంగరాజం ఇంటి వద్దే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ వివరాలు ఇలా..

Telangana: ఆస్తి తగాదాలో తల్లిపై దాడి చేసిన కొడుకు.. చివరికి జరిగిందిదే..
Jagityal District

Edited By: Ravi Kiran

Updated on: Aug 14, 2025 | 12:51 PM

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలో గంగరాజు అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు లక్ష్మణ్ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లగా.. చిన్న కుమారుడైన గంగరాజం ఇంటి వద్దే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుమార్తె భాగ్యకు రాయికల్ మండలం రామాజిపేట్ గ్రామానికి చెందిన ఓ యువకుడిని ఇచ్చి వివాహాం జరిపారు. సదరు వృద్ధురాలిని గత కొన్నిరోజులుగా కుమారులు పట్టించుకోకపోవడంతో.. కూతురు భాగ్య ఆలనాపాలన చూసుకునేది.

తల్లి గంగరాజు కూతురు భాగ్యకు పెన్షన్ డబ్బులు ఇస్తుందనే కారణంతో బుధవారం అర్ధరాత్రి చిన్నకొడుకు గంగరాజం తల్లిని చితకబాది ఇంట్లో పెట్టి తాళం వేశాడు. విషయం తెలుసుకున్న పెద్దకుమారుడి కొడుకు వినోద్ తాళం పగలగొట్టి రాయికల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన పోలీసులు వచ్చి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కొడుకు గంగరాజం కొట్టిన దెబ్బలకు చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. కూతురికి పెన్షన్ డబ్బులు ఇస్తుందని.. మళ్ళీ ఆస్తులు కూడా కుతురికి ఇస్తుందనే కారణంతో కొట్టానని నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం. కూతురికి డబ్బులు, ఆస్తులు ఇస్తుందని ఈ దారుణానికి ఒడిగట్టాడు. డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు కసాయి కొడుకు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.