
School Holidays: విద్యాసంస్థలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులకు సంబరాలే. ఈ నెలలో చాలా సెలవులు వచ్చాయి. వరుసల సెలవులతో ఎంజాయ్ చేసిన విద్యార్థులకు ఈనెల 21న మరోసారి సెలవు రానుంది. ఈ రోజు శుక్రవారం అవుతుంది. మరుసటి రోజు 22వ తేదీ శనివారం, ఆ తర్వాత 23 ఆదివారం. ఇలా శనివారం కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది. కొన్ని పాఠశాలలకు ఆఫ్‌డే ఉంటుంది. ఇలా చూసుకుంటే మరోసారి వరుస సెలవుల అస్వాదించవచ్చు విద్యార్థులు. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారులు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇంతకీ సెలవు ఎందుకనేగా మీ సందేహం.
ఇది కూడా చదవండి: Goat Farming: ఏ మేక జాతి ఎక్కువ ఆదాయం, పాలను ఇస్తుంది? ఈ మేకలతో కోటీశ్వరులు కావచ్చు..!
ఆగస్ట్ 21న శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం వరలక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ పండుగకు ఉన్న ప్రాధాన్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవు ప్రకటించే సంప్రదాయం ఉంది. అయితే 2026 ఆగస్టు 21న ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే విధంగా సెలవు ఉంటుందని చెప్పే ముందు ఆయా రాష్ట్రాల అధికారిక ఉత్తర్వులను పరిశీలించాలి. రాష్ట్రానికి రాష్ట్రానికి సెలవుల జాబితాలో తేడాలు ఉండొచ్చు. ఎందుకంటే వరలక్ష్మీవ్రతం రోజున పాఠశాలలకు తప్పనిసరిగ్గా సెలవు ఇస్తారు.
ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించిన రాష్ట్రాల్లో సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు వంటి వాటికి ఆ సెలవు వర్తించే అవకాశం ఉంటుంది. జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు కూడా సంబంధిత ఉత్తర్వుల పరిధిలోకి రావచ్చు.
తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగల్లో శ్రావణ శుక్రవారం జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ వారం ఆగస్టు 21న (శుక్రవారం) తెలుగు మహిళలు శ్రావణ వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఉంటుంది. ముఖ్యంగా హిందుత్వ ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
ఇలా వరలక్ష్మి వ్రతం ముగిసిన వెంటనే శనివారం, ఆదివారం సాధారణ వారపు సెలవులు రానున్నాయి. దీనితో ఆగస్టు 21, 22, 23 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ లభించనుంది. ఏదీ ఏమైనా విద్యార్థులకు పండగే.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. 2026లో వరలక్ష్మీ వ్రతం ప్రధానంగా ఆచరిస్తారు. ఆగస్టు 21దక్షిణ భారత సంప్రదాయాల (తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ప్రకారం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని పరిగణిస్తారు. అయితే, కొన్ని ఉత్తర భారతీయ లేదా ద్రిక్ పంచాంగ్ గణనలు వేర్వేరు ప్రాంతీయ క్యాలెండర్ నియమాల ఆధారంగా ఆగస్టు 28న జరుపుకొంటారు. అయితే ఇలా తీసుకున్న 28న వరలక్ష్మీ వ్రతం జరుపుకొంటే ఆ ప్రాంతాల్లోని విద్యార్థులకు వరుస సెలవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: TATA: 100 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారట.. టాటాకు మరో కొత్త సవాల్..!
ఇది కూడా చదవండి: Biryani Recipe: వారి జీవితాన్నే మార్చేసిన అమ్మమ్మ బిర్యానీ రెసిపీ.. రూ.5 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్ల వ్యాపారం.. అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ