TRS: టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌.. నామినేషన్ల స్వీకరణకు డేట్ ఫిక్స్..

|

Oct 17, 2021 | 11:22 AM

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

TRS: టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌.. నామినేషన్ల స్వీకరణకు డేట్ ఫిక్స్..
Trs
Follow us on

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. శనివారం (ఈ నెల 23) ఉదయం 11 గంటలకు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు వెల్లడించారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. 25న హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు.

  • 22 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.
  • 23 న స్క్రూటినీ ఉంటుంది
  • 24 న నామినేషన్ల ఉపసంహరణ
  • ఈనెల 25 న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ.
  • ఇదే రోజు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో కోలాహలం నెలకొన్నది.

విజయగర్జన సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది TRS. కోవిడ్ కారణంగా ఇటీవల భారీ సభలేమీ నిర్వహించలేదు. అందుకే వరంగల్‌ సభను ఫుల్‌జోష్‌తో నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలుపెట్టింది. విజయగర్జన ఏర్పాట్లపైనా నేతలకు సూచనలు చేయనున్నారు సీఎం కేసీఆర్.

ఇవి కూడా చదవండి: Software Update: మీ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మెసెజ్ వస్తోందా.. చేసుకోక పోతే ఇక అంతే..

Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..