సింగరేణిలో 372 నర్సు పోస్టులు.. హైకోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్‌ జారీ.. ఈనెల 27 దరఖాస్తుకు చివరితేది..

|

Feb 24, 2021 | 4:52 AM

SCCL Recruitment 2021: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌

సింగరేణిలో 372 నర్సు పోస్టులు.. హైకోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్‌ జారీ.. ఈనెల 27 దరఖాస్తుకు చివరితేది..
Follow us on

SCCL Recruitment 2021: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 372 నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 27 దరఖాస్తులకు చివరితేది. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ అప్లయ్‌ చేసుకోనవసరం లేదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://scclmines.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

అయితే జూనియర్‌ నర్సు పోస్టులకు మహిళా అభ్యర్థులతో పాటు పురుషులు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సింగరేణి సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు ఇలా ఉన్నాయి. ఫిట్టర్- 128, ఎలక్ట్రీషియన్- 51, వెల్డర్- 54, టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 22, మోటార్ మెకానిక్ ట్రైనీ- 14, ఫౌండర్ మెన్ – 19, జూనియర్ స్టాఫ్ నర్స్- 84

పోస్టులను బట్టి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కావడంతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఎస్‌సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ. 200గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 27, 2021 మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ :https://scclmines.com/ సంప్రదించగలరు.

Central Electoral Commission: బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలపై కసరత్తు..