SBI ATM catches fire: ఎస్బీఐ ఏటీఎంలో మంటలు..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎస్బీఐ ఏటిఎంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కి ఏటిఎం పూర్తిగా దగ్ధమైంది. తగలబడిన సమయంలో

SBI ATM catches fire: ఎస్బీఐ ఏటీఎంలో మంటలు..
Fire In Sbi Atm

Updated on: Oct 22, 2021 | 8:41 AM

SBI ATM catches fire: సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎస్బీఐ ఏటిఎంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కి ఏటిఎం పూర్తిగా దగ్ధమైంది. తగలబడిన సమయంలో ఏటీఎంలో ఎంత మొత్తం క్యాష్ ఉందనేది బ్యాంక్ అధికారులు వస్తేనే క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. అర్థరాత్రి సమయంలో ఏటిఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఫైర్ సేఫ్టీ అలారం మోగడంతో మేనేజర్ అలర్టయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందిని రప్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలో ఏటిఎం పూర్తిగా దగ్థమైంది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు.

Read also: AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం