ఆసుపత్రి బెడ్‌ పై నుంచే బాధ్యతల స్వీకరణ.. అంబులెన్స్‌లోనే ఓ మహిళ సర్పంచ్‌ ప్రమాణంస్వీకారం!

అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్‌కే పరిమితమైనా కూడా అంబులెన్స్‌లోనే ఓ మహిళ సర్పంచ్‌గా ప్రమాణం చేశారు. జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్‌గా గొల్లపల్లి అలేఖ్య ఎన్నికయ్యారు. అయితే.. దురదృష్టవశాత్తూ ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు.

ఆసుపత్రి బెడ్‌ పై నుంచే బాధ్యతల స్వీకరణ.. అంబులెన్స్‌లోనే ఓ మహిళ సర్పంచ్‌ ప్రమాణంస్వీకారం!
Sarpanch Oath Ceremony From His Hospital Bed

Updated on: Dec 23, 2025 | 11:13 AM

అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్‌కే పరిమితమైనా కూడా అంబులెన్స్‌లోనే ఓ మహిళ సర్పంచ్‌గా ప్రమాణం చేశారు. జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్‌గా గొల్లపల్లి అలేఖ్య ఎన్నికయ్యారు. అయితే.. దురదృష్టవశాత్తూ ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. సర్జరీ అనంతరం ఆమె కనీసం బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో నిన్న నూతన సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారానికి గడువు ఉండటంతో.. అలేఖ్య తన బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో డిసెంబర్ 22 సోమవారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలనుకున్నారు. ఆమె అంబులెన్స్‌లోనే గ్రామానికి చేరుకున్నారు. అంబులెన్స్ బెడ్ పై ఉన్న అలేఖ్యతో సర్పంచ్‌గా అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. త్వరలో అనారోగ్యం నుంచి కోలుకొని గ్రామస్తులకు సేవ చేస్తానన్నారు అలేఖ్య.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..