Sajjanar: యూట్యూబర్ హర్షసాయిపై సజ్జనార్ ఫైర్.. రిపోర్ట్ కొట్టాలని నెటిజన్స్‌కు పిలుపు

| Edited By: Ram Naramaneni

Mar 15, 2025 | 8:10 PM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనంగా మారుతోంది. బతుకుని పణంగా పెట్టి ఆడుతున్న జూదంలో ప్రాణాలు సమిధలవుతున్నాయి. వస్తే లక్షలు...పోతే ప్రాణాలు అన్నట్లు మారిపోయింది సిట్యువేషన్‌. లక్షలు, కోట్లు రాకపోయినా, ఆస్తులు హరించుకుపోయి...అప్పులు మిగులుతున్నాయి. అవి తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌ను కొందరు తెలుగు సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్స్ ప్రమోట్ చేయడం వివాదాస్పదం అవుతుంది.

Sajjanar: యూట్యూబర్ హర్షసాయిపై సజ్జనార్ ఫైర్.. రిపోర్ట్ కొట్టాలని నెటిజన్స్‌కు పిలుపు
Harsha Sai - VC Sajjanar
Follow us on

యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్స్ కొందరు డబ్బు కోసం అతిగా ప్రవర్తిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, ఇతర జూదాల వైపు ఫాలోవర్స్‌ను ఉసిగొల్పుతున్నారు. కొంతమంది అమాయక వ్యక్తులు వారి మాటలు నమ్మి.. బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి.. సర్వస్వం కోల్పోతున్నారు. మరికొందరు చేసిన అప్పులు కట్టలేక.. ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నాం. తొలుత చిన్న మొత్తాల్లో మొదలైన ఈ జూదం.. ఆ తర్వాత ఒక వ్యసనంలా మారిపోయి.. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు యువకులు ఈ బెట్టింగ్ యాప్స్ బలి తీసకుుంటున్నాయి.

ఇలాంటి తప్పుడు పనులు చేసే ఇన్ఫ్లూయెన్సర్ల బెండు తీస్తున్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్. యువకులను హెచ్చరిస్తూనే.. ఇలాంటి ఇన్ఫ్లూయెన్సర్లను అన్ ఫాలో చేసి.. వారి అకౌంట్లకు రిపోర్ట్ కొట్టాలని సూచిస్తున్నారు. అంతేకాదు అతి చేస్తోన్న వారిపై పోలీసులకు కూడా ఆయనే ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి.. గతంలో మాట్లాడిన వీడియోను ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘‘చేస్తున్నదే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్రమోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు! ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు. ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్కడి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లూయెన్సర్ల అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్యత నిర్వర్తించండి” అని సజ్జనార్ ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇవే కాదు ఇతర సైబర్ నేరాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించేలా ఆయన పోస్టులు వేస్తుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.