Minister KTR: కేంద్రం చేతిలో రాజకీయ పావులుగా గవర్నర్లు..మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కోణతం దిలీప్ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. అయితే దీనిపై రీట్విట్ చేసిన కేటీఆర్ తన అభిప్రాయాన్ని జోడించారు.

Minister KTR: కేంద్రం చేతిలో రాజకీయ పావులుగా గవర్నర్లు..మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Minister KTR

Updated on: Apr 11, 2023 | 12:14 PM

బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కోణతం దిలీప్ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. అయితే దీనిపై రీట్విట్ చేసిన కేటీఆర్ తన అభిప్రాయాన్ని జోడించారు. దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేసేందుకు గవర్నర్లు తమ అధికారాల్ని నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని కోణతం దిలీప్ ఆరోపించారు. బ్రిటీష్ కాలం నాటి వలస వాద గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. అలాగే గవర్నర్లకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆయన సమర్ధించారు.

ఈ క్రమంలో దిలీప్ చేసిన ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్.. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వం చేతిలో రాజకీయ పావులుగా మరడం చాలా బాధకరమన్నారు. నాన్ బీజేపీ రాష్ట్రాలను చూస్తే వాటికి కేంద్రం అధినంలో ఉన్న గవర్నర్లు సహకరించకపోవడం, ప్రతీకారంతో వ్యవహరించడం కనిపిస్తోందని తెలిపారు.ఇలాంటి వైఖరి సహకార సమాఖ్య పాలనకు మోడలా అని ప్రశ్నించారు. టీమ్ ఇండియా స్పూర్తి దేశ ప్రగతికి, అభివృద్ధికి సహాయపడుతుందా అని అడిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..