తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఓ నిర్ణయానికి ఉద్యోగులు ఊగిపోతున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇంతకీ ఆర్టీసీ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి.? ఉద్యోగులకు అంతలా కోపం రావడానికి కారణం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. సాధారణంగా ఏ సంస్థలో అయినా ఉద్యోగులకు టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్‌ను అందుకోవడానికి ఉద్యోగులకు మోటివేట్ చేస్తుంటారు. అయితే తెలంగాణ ఆర్టీసీ ఈ విషయంలో హద్దు దాటింది.
టార్గెట్ అందుకోలేని ఉద్యోగులను అవమానకర రీతిలో ట్రీట్ చేసింది. తక్కువ టికెట్‌లు అమ్మారన్న కారణంతో కండక్టర్ల ఫొటోలను ఫ్లెక్సీ ప్రింట్ చేసి ప్రదర్శించారు. మేడ్చల్ డిపో పేరుతో వెలిసిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మే నెలలో తక్కువ టికెట్లు అమ్మిన కండక్టర్లు వీరేనంటూ ఏకంగా ఫొటోలతో సహా ఫ్లెక్సీలు వేశారు.
అంతటితో ఆగకుండా అమ్మిన టికెట్ల సంఖ్యను కూడా సదరు ఫ్లెక్సీలో ప్రస్తావించారు. ఆర్టీసీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలతో పాటు, ఆర్టీసీ యూనియన్‌లు ఈ చర్యను తీవ్రంగా తప్పుడుతున్నాయి. మరి దీనిపై ఆర్టీసీ ఉన్నతధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..