Telangana: సీజేఐ ఎన్వీ రమణకు థ్యాంక్స్‌ చెప్పిన సజ్జనార్‌.. ఎందుకంటే..

|

Nov 04, 2021 | 8:21 AM

తమ ఊరికి ఆర్టీసీ బస్సులు రావడం లేదని, స్కూల్‌కు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఏకంగా

Telangana: సీజేఐ ఎన్వీ రమణకు థ్యాంక్స్‌ చెప్పిన సజ్జనార్‌.. ఎందుకంటే..
Follow us on

తమ ఊరికి ఆర్టీసీ బస్సులు రావడం లేదని, స్కూల్‌కు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్.వి. రమణకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. చిన్నారి లేఖపై స్పందించిన సీజేఐ కార్యాలయం వెంటనే ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లింది. చిన్నారి గ్రామానికి ఆర్టీసీ బస్సును ఏర్పాటుచేయాలని ఆర్టీసీ ఎండీని కోరింది. దీంతో వెంటనే స్పందించిన ఎండీ సజ్జనార్‌ చిన్నారి ఊరికి ఆర్టీసీ బస్సును ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న ఎండీ ఆర్టీసీ బస్సుల పునరద్ధరణపై తమను అప్రమత్తం చేసినందుకు సీజేఐ ఎన్వీరమణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ నంబర్లను సంప్రాదించండి..
ఇక లేఖ రాసిన చిన్నారి పేరు పి. వైష్ణవి. 8వ తరగతి చదువుతోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిందేడు ఈ చిన్నారి సొంతూరు కాగా.. కరోనా తర్వాత ఈ ఊరికి ఆర్టీసీ బస్సులు నిలిపివేయబడ్డాయి. ఈ విషయంపైనే చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీరమణకు లేఖ రాసింది. వైష్ణవి గ్రామానికే కాదు త్వరలో తెలంగాణలో అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రవాణా సౌకర్యాలను ఏర్పాటుచేసి ఎలాంటి ఇబ్బందిలేకుండా చూస్తామని సజ్జనార్‌ పేర్కొన్నారు. విద్యార్థులు కానీ ప్రజలు తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు పునరుద్ధరణకు 040- 30102829, 68153333 నంబర్లలో సంప్రదించాలని, లేకపోతే @tsrtcmdoffice కి ట్వీట్‌ చేయాలని ఎండీ సూచించారు.

Also Read:

Telangana: అక్టోబర్‌ మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్‌ టైం రికార్డు.. ఒక్క నెలలోనే మందు బాబులు ఎంత తాగారంటే..

Yadadri Temple: డ్రోన్‌ కెమెరాల్లో యాదాద్రి ఆలయం.. కట్టిపడేస్తున్న సుందర దృశ్యాలు..

Accident: పండుగ పూట విషాదం.. ప‌టాకులు కొనేందుకు వెళ్లి నలుగురు దుర్మరణం..