Narketpally: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం(A.p.lingotam) వద్ద ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే రోడ్డు పక్కన (National High way) ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నార్కట్ పల్లి ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు.. భద్రాచలం నుంచి 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. దీనికి డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..