ఆల్‌ టైం రికార్డ్‌.. హైదరాబాద్ లో రూ.2.32కోట్లు పలికిన గణేష్‌ లడ్డూ.. ఎక్కడంటే..

తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, వినాయక లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకు వస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలకడం దశాబ్ధాల చరిత్ర. అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డూ వేలం పాటలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట చరిత్ర సృష్టించింది.

ఆల్‌ టైం రికార్డ్‌.. హైదరాబాద్ లో రూ.2.32కోట్లు పలికిన గణేష్‌ లడ్డూ.. ఎక్కడంటే..
Balapur Laddu Auction

Updated on: Sep 06, 2025 | 7:35 AM

వినాయక చవితి ఉత్సవాలు అంటేనే ముందుగా ముంబై తరువాత అందరికీ గుర్తుకు వచ్చేది మన భాగ్యనగరమే. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ భారీ గణనాధుడు, బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట. తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, వినాయక లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకు వస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలకడం దశాబ్ధాల చరిత్ర. అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డూ వేలం పాటలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట చరిత్ర సృష్టించింది.

హైదరాబాద్‌లో గణపతి లడ్డూ వేలంలో రికార్డ్‌ సృష్టించింది. రాజేంద్రనగర్‌ సన్‌ సిటీలోని రిచ్‌మండ్ విల్లాలో ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డూ ఏకంగా రూ. 2.32 కోట్లకు అమ్ముడుపోయింది. శుక్రవారం జరిగిన ఈ వేలంపాటలో గత ఏడాది రికార్డును తిరగరాస్తూ ఈ భారీ ధర పలికింది. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతుంటారు. ఈ సారి రూ. కోటి నుంచి వేలం మొదలుపెట్టినట్లు సమాచారం. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87కోట్లు పలికింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..