Telangana: పంచాయితీలో కరెంట్ బిల్లు కొట్టేందుకు వచ్చిన సిబ్బంది.. ఎంత వచ్చిందోనని సర్పంచ్ చూడగా..

|

Feb 14, 2023 | 5:13 PM

ఓ వైపు పెరుగుతున్న విద్యుత్‌ ధరలు జనాలను నిద్రపోనివ్వకుండా చేస్తుంటే.. మరో వైపు కోట్లలో బిల్లులు కొడుతూ..

Telangana: పంచాయితీలో కరెంట్ బిల్లు కొట్టేందుకు వచ్చిన సిబ్బంది..  ఎంత వచ్చిందోనని సర్పంచ్ చూడగా..
Representative Image
Follow us on

ఓ వైపు పెరుగుతున్న విద్యుత్‌ ధరలు జనాలను నిద్రపోనివ్వకుండా చేస్తుంటే.. మరో వైపు కోట్లలో బిల్లులు కొడుతూ మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు విద్యుత్‌ శాఖ సిబ్బంది. పూరిగుడిసెలకు కూడా లక్షల్లో కరెంట్‌ బిల్లులు వేస్తున్నారు. తాజాగా ఓ పంచాయితీ కార్యాలయానికి ఒక్క నెలకు గాను 11 కోట్ల 41 లక్షల విద్యుత్‌ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి సదరు పంచాయితీ సర్పంచ్‌ షాక్‌ తిన్నారు. వెంటనే ఆ బిల్లు పట్టుకుని విద్యుత్‌ శాఖ అధికారుల వద్దకు పరుగు తీశారు.

ఆ బిల్లు పరిశీలించిన సంబంధిత ఏఈ, సాంకేతిక తప్పిదం వల్లే బిల్లు అంత భారీగా వచ్చిందని, మీటర్ ను మరోసారి చెక్ చేసి, తిరిగి మళ్లీ బిల్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో సర్పంచ్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బిల్లు గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఈ దెబ్బతో తమకు వచ్చిన బిల్లుల్లో ఎన్ని కోట్లు ఉన్నాయోనని బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కొత్తపల్లి గ్రామ పంచాయితీలో జరిగింది.