Telangana: పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

|

Nov 04, 2024 | 4:30 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పీవీ  ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Telangana: పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్
Road Accident
Follow us on

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ  ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. అతివేగంగా వచ్చిన కారు స్తంభాన్ని ఢీకొనడంతో ఒకసారిగా స్తంభం విరిగిపడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కారులో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో ఇదిగో:

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి