Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

| Edited By: Subhash Goud

Dec 25, 2023 | 11:58 AM

ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెడ్డవూర మండలం పల్లేవాని కుంట తండా, పుల్యా తండాకు ఏడుగురు టాటా ఏస్ వాహనంలో ప్రమాదస్థలికి బయలుదేరారు. నిడమనూరు మండలం శాఖాపురం సమీపంలోటాటా ఏస్ వాహనాన్ని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా..

Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Nalgonda Road Accident
Follow us on

నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. పాదచారుడిని బైకిస్టు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. టాటా ఏస్ వాహనాన్ని ట్యాంకర్ ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు. ఈ రెండు ప్రమాదాలు నిడమనూరు మండల పరిధిలో జరిగాయి. మండలంలోని వేంపాడు స్టేజి వద్ద రాత్రి 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ ను బైక్ ఢీ కొట్టింది. దీంతో రమావత్ కేశవ తో పాటు బైకిస్ట్ నాగరాజు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెడ్డవూర మండలం పల్లేవాని కుంట తండా, పుల్యా తండాకు ఏడుగురు టాటా ఏస్ వాహనంలో ప్రమాదస్థలికి బయలుదేరారు. నిడమనూరు మండలం శాఖాపురం సమీపంలోటాటా ఏస్ వాహనాన్ని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..

రెండు ప్రమాదాల్లో మల్లేవని కుంట తండాకు రమవత్ సేవలు (19),రమావత్ గణ్య(40), రమావత్ నాగరాజు, పుల్య తండాకు చెందిన రమావత్ పాండు (42), రమావత్ బుజ్జి (38), వెంపాడుకు చెందిన బురుసు సైదులు (60) పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరణాలతో పుల్య తండాలో విషాదం అలుముకుంది. పేదరికంలో ఉన్న మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి