Telangana News: ఆయనో ఆర్ఎంపీ.. కానీ, గైనకాలజిస్ట్ అవతరమెత్తాడు.. కార్పోరేట్ ఆస్పత్రిని తలదన్నే తరహాలో ఆస్పత్రి నిర్మించిన ఆ RMP ఎలాంటి క్రిటికల్ శస్త్ర చికిత్స లైనా అవలీలగా చేసేస్తున్నాడు. అతనిపై ఫిర్యాదులు వెల్లువేత్తడంతో వరంగల్ టాస్క్‌ఫోర్స్ అండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేశారు.. ఆస్పత్రి సీజ్ చేసి RMPతోపాటు మరోవ్యక్తిని అరెస్ట్ చేశారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన సమ్మయ్య అనే ఆర్ఎంపీ గైనకాలజీ డాక్టర్ గా అవతారమెత్తాడు.. మండల కేంద్రంలో కమల పాలి క్లినిక్ పేరుతో ఓ ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఆయన బోర్డుపై ఓ ఎంబీబీఎస్ వైద్యుడి పేరు తగిలించాడు.. లోపల మాత్రం అంతా ఈయనే. గత కొన్నేళ్లుగా ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తూనే పిల్లలు కాని వారికి ప్రత్యేక వైద్యం అందిస్తానని.. అబార్షన్లు కూడా అతి తక్కువ ఫీజుతో చేస్తున్నాడు.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందు జాగ్రత్తగా హనుమకొండకు చెందిన వైద్యుల పేర్లతో క్లినిక్ ఏర్పాటు చేశాడు..,అర్హత లేకున్నా తానే పరీక్షలు నిర్వహిస్తూ టెస్టులు, ఇంజెక్షన్లు వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నాడు.
ఈ ఆర్ఎంపీ దందాలు వరంగల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు అందడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆసుపత్రిపై దాడులు నిర్వహించారు.. ఎటువంటి అర్హతలేకుండానే వైద్యం అందిస్తున్నారని నిర్ధారణకు వచ్చిన అధికారులు హాస్పిటల్ సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.. ప్రజలు అర్హతలేని వైద్యుల దగ్గరికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, అర్హత లేకున్నా వైద్యం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Also read:
Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!
Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!