CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి స్పీచ్.. ఏమన్నారంటే..
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటి స్పీచ్ ఇచ్చారు. ముందుగా జై తెలంగాణ.. జై సోనియమ్మ అనే నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటి స్పీచ్ ఇచ్చారు. ముందుగా జై తెలంగాణ.. జై సోనియమ్మ అనే నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఆశామాషీగా ఏర్పడింది కాదు అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం అనేక పోరాటాలతో, అమరవీరుల త్యాగాల పునాది మీద, ఎన్నో ఆకాంక్షలు, ఆశలతో ఏర్పాడిందని ప్రజలకు తెలిపారు. రాష్ట్ర అభివృద్దిలో మీ ఆలోచనలను పంచుకోవచ్చన్నారు. తెలంగాణను సంక్షేమ, అభివృద్ది రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ రేవంత్ రెడ్డిది అన్నారు.
ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్దలుకొట్టినామన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా పేరుమార్చి ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికి కృషి చేస్తానన్నారు. నగరంలోని శాంతి భద్రతలను కాపాడుతూ దేశంలోనేకాదు ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా చేస్తానన్నారు.
ఈ ప్రభుత్వం ఏర్పడటానికి సహాకరించిన లక్షలాది కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మీ కష్టాన్ని, శ్రమని గుర్తుపెట్టుకొని గుండె ధైర్యాన్ని నింపుకుంటా అన్నారు. 10ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నారు. ముందుగా రాష్ట్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమర వీరుల కుటుంబాలకు న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. అందులో భాగంగా రెండు ఫైల్స్ పై సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన ఆరు గ్యారెంటీల అమలుకు నోచుకునేలా ఆరు గ్యారెంటీల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అలాగే అంగవైకల్యంతో బాధపడుతున్న రజినీకి ఉద్యోగాన్ని ఇస్తూ ఉద్యోగ నియమక పత్రంపై రెండో సంతకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..