హెటల్‌కి వెళ్లి.. ఆలోచించకుండా బిర్యానీ ఆర్డర్ ఇచ్చి.. వేడివేడిగా సర్వ్ చేయగానే.. ఆవురావురుమంటూ ఆరగించేస్తున్నారా..? ఆగండాగండి.. బయట అలాంటి ఫుడ్స్ తినేందుకు ఒకటికి వంద సార్లు ఆలోచించండి. ఎందుకంటే.. మీరు టేస్టీగా ఉందని లాగేంచేస్తున్న ఆ బిర్యానీ ప్రాసెసింగ్ టాయిలెట్‌లో జరిగి ఉండవచ్చు. అదేంటని నొసలు ఎగరేస్తున్నారా..? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా.. అయితే మీ కోసం వీడియోను సాక్ష్యంగా దిగువన ఇస్తున్నాం.. కళ్లు పెద్దవి చేసి చూడండి. ఒకసారి కాదు రెండు మూడు సార్లు రిపీట్ వేసి చూడండి.
చూశారుగా.. కస్టమర్స్ టాయిలెట్ కోసం బాత్రూంకి వెళ్తే.. అక్కడ బిర్యానీ రైస్ కడుగుతూ కనిపించారు అక్కడి స్టాఫ్. అచ్చంగా లెట్రీన్ కమోడ్ పక్కన ఈ తంతు జరుగుతుంది. ఇంకేముంది అక్కడి కస్టమర్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హోటల్ మేనేజర్‌ను పిలిచి చెడా మడా తిట్టారు. సిద్దిపేటలోని సోని రెస్టారెంట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇదేంటని యాజమాన్యాన్ని అడిగితే.. మోటర్ కాలిపోయింది.. వాటర్ ప్రాబ్లం ఉందని రెస్టారెంట్ వాళ్ల నుంచి సమాధానం వచ్చింది. దీంతో మీది కాదు.. ఇక్కడ తినేందుకు వచ్చిన మాది తప్పు అని లెంపలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంట్లో అస్సలు తినకుండా బయట ఫుడ్ మాత్రమే ఆరగించే మహారాజులు మరొక్కసారి పై వీడియోపై లుక్కేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం