Renuka Chowdary: షర్మిల తెలంగాణ కోడలైతే.. నేను ఆడబిడ్డను.. అర్హత ఉండాలంటూ రేణుకాచౌదరి ఫైర్‌..

|

Sep 03, 2023 | 9:11 PM

Renuka Chowdhury On YS Sharmila: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఓ వైపు వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్‌ విలీనం కోసం వైఎస్‌ షర్మిల.. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీలతో సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే, షర్మిల పార్టీలే చేరే విషయంపై కాంగ్రెస్‌ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Renuka Chowdhury On YS Sharmila: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఓ వైపు వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్‌ విలీనం కోసం వైఎస్‌ షర్మిల.. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీలతో సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే, షర్మిల పార్టీలే చేరే విషయంపై కాంగ్రెస్‌ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా.. వైఎస్‌ షర్మిలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు రేణుక చౌదరి ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌లో YTP విలీనం, ఆ పార్టీ నాయకురాలు షర్మిల చేసిన ప్రకటనలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి రుసరుసలాడారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే తాను ఆడబిడ్డనని అన్నారు. షర్మిల చెప్తే సరిపోదని, తమకు తమ హైకమాండ్‌ చెప్పాలని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. తెలంగాణ కోడలు అని షర్మిలకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ఫైరయ్యారు రేణుకా చౌదరి.

షర్మిల తెలంగాణ కోడలైతే.. నేను తెలంగాణ ఆడబిడ్డనంటూ వివరించారు. షర్మిల ఏదన్నా అడగొచ్చు.. ట్యాక్స్‌ ఏమీ లేదు కదా అని ప్రశ్నించారు. కానీ ఏదన్నా అడగడానికి అర్హత ఉండాలంటూ రేణుకాచౌదరి పేర్కొన్నారు. షర్మిల.. రాహుల్‌, సోనియాను కలిశారంతే..వాళ్లేమీ షర్మిలకు చెప్పలేదంటూ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..