రావణ దహనంలో అపశ్రుతి.. జనాలమీదకు దూసుకువచ్చిన టపాసులు.. తప్పిన పెను ప్రమాదం..
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇక సాయంత్రం సమయంలో పలు చోట్ల రావణ దహనం నిర్వహించారు. అయితే ఈ రావణ దహనంలో అపశృతి చోటు చేసుకుంది. రావణుడి బొమ్మలో పెట్టిన టపాసులు పేలి జనాలమీదకు వచ్చేశాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ లో జరిగింది. రావణ దహనం చేస్తుండగా ఒక్కసారిగా జనాల మీదకు టపాసులు దూసుకువచ్చాయి. దాంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదాంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పిందంటూ జనాలు ఊపిరిపీల్చుకున్నారు. ఒక్కసారి ఊహించని విధంగా టపాసులు దూసుకురావడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :