Ration Dump: కంది చేనులో రేషన్ మాఫియా కథలు.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ చేసిన పోలీసులు..

|

Nov 17, 2021 | 9:53 PM

Ration Dump: తెలంగాణలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పేద ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్య పక్కదారి పట్టకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ..

Ration Dump: కంది చేనులో రేషన్ మాఫియా కథలు.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ చేసిన పోలీసులు..
Ration Rice
Follow us on

Ration Dump: తెలంగాణలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పేద ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్య పక్కదారి పట్టకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మాఫియా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చివరకు పంటచేలను కూడ వదలడం లేదు రేషన్ మాఫియా. రేషన్ బియ్యం స్మగ్లర్లు పంట చేను సేఫ్ అనుకున్నారో ఏమో గానీ, కొద్ది రోజులుగా శివారు ప్రాంతాలు, పంటచేలలోనే స్థావరాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, అధికారుల కళ్లుగప్పి గుట్టుగా నడుస్తున్న అక్రమ బియ్యం చీకటి వ్యాపారాన్ని పోలీసులు రట్టు చేశారు.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. గ్రామ శివారులోనీ కందిచేనులో డెన్ ఏర్పాటు చేసుకుని, కంట్రోల్ బియ్యం వ్యాపారాన్ని గుట్టుగా కొనసాగిస్తున్నారు. పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల మూలంగా పక్కదారి పడుతోంది. కందిచేనులో 200 బస్తాలు 100 కింటాళ్ల రేషన్ బియ్యం డంప్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. కొద్ది రోజులుగా బియ్యం పై నిఘా పెట్టిన పోలీసులకు, రేషన్ బియ్యం నిల్వచేశారన్న సమాచారం అందడటంతో దాడి చేశారు. పట్టబడ్డ బియ్యం బస్తాలను కొత్తగూడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే రేషన్ బియ్యాన్ని ఎవరు నిల్వ చేశారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Also read:

Viral Video: వధూవరుల కాస్ట్‌లీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. ఫన్నీగా స్పందిస్తోన్న నెటిజన్లు..

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

Kulbhushan Jadhav: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్‌ కోర్టు