జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌

కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ దవాఖానాలను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగానే అన్ని జిల్లా కేంద్రాలు, పీహెచ్‌సీ సెంటర్లలోనూ నాణ్యమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచిన అధికారులు..రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో తొలిసారిగా ఓ అరుదైన ఆపరేషన్‌ చేశారు వైద్యులు. సుమారు రెండు గంటలపాటు శ్రమించిన డాక్టర్ల బృందం..రెండేళ్ల బాలుడికి ప్రాణం పోశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణంలోని వాణి నగర్‌కు చెందిన […]

జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 14, 2019 | 1:24 PM

కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ దవాఖానాలను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగానే అన్ని జిల్లా కేంద్రాలు, పీహెచ్‌సీ సెంటర్లలోనూ నాణ్యమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచిన అధికారులు..రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో తొలిసారిగా ఓ అరుదైన ఆపరేషన్‌ చేశారు వైద్యులు. సుమారు రెండు గంటలపాటు శ్రమించిన డాక్టర్ల బృందం..రెండేళ్ల బాలుడికి ప్రాణం పోశారు. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల పట్టణంలోని వాణి నగర్‌కు చెందిన సుమలత – రవి దంపతుల రెండేళ్ల కుమారుడు శివ. గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. శివను పరీక్షించిన డాక్టర్లు అతనికి ఊపిరితిత్తుల సమస్య ఉందని చెప్పారు. ఒకవైపు ఊపిరితిత్తులు పూర్తిగా చీముతో నిండిపోయి ఉండడంతో బాబుకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిందని గుర్తించారు. బాలుడి పరిస్థితిపై పూర్తి అవగాహనకు వచ్చిన వైద్య బృందం వెంటనే అతనికి ఆపరేషన్‌ చేసి చీమును తొలగించారు. రెండు గంటలపాటు నిర్వహించిన శస్త్రచికిత్సతో శివ పూర్తిగా కొలుకున్నాడు. శ్వాస తీసుకోవడం కూడా సులువుగా మారిందని డాక్టర్లు చెప్పారు. అయితే, కేవలం ఈ సర్జీర హైదరాబాద్‌లోని గాంధీ, నిమ్స్ ఆస్పత్రిలో మాత్రమే చేస్తారని, ప్రైవేటులో అయితే, ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. అటువంటిది మొట్టమొదటి సారిగా జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో నిర్వహించినట్లుగా వైద్యులు వెల్లడించారు.