- రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: కేటీఆర్
- స్వయంకృషితో ఎదిగిన గొప్ప దార్శనికుడు.. రామోజీరావు: కేటీఆర్
- రామోజీరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: కేటీఆర్
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు.. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట హిస్టరీ క్రియేట్ చేశారు. అలాగే, సినీరంగంలోనూ తనదైన ముద్రవేశారు రామోజీ. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించి తన అభిరుచి చాటుకున్నారు. ప్రతిఘటన, మౌనపోరాటం, జడ్జిమెంట్, మయూరి, కాంచన గంగ వంటి ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు. జర్నలిజం, సాహిత్యం, విద్యా రంగాల్లో ఆయన చేసిన సేవలకు గానూ 2016లో కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
రామోజీ రావు మరణం తెలుగు జాతికి తీరని నష్టం. పత్రిక, సినిమాలు, వ్యాపారం ఎందులోనైనా అత్యున్నత ప్రమాణాలు పాటించేవారు. నేను దర్శకుడు కావడానికి ఆయనే కారణం. చిత్రం సినిమాను 20 నిమిషాల్లో ఒకే చేశారు. ఆయన దగ్గర ప్రతి పని పద్దతి ప్రకారం జరుగుతుంది. నా జీవితంలో చూసిన అతి గొప్ప భారతీయుల్లో రామోజీ రావు ఒకరు అని అన్నారు డైరెక్టర్ తేజ.
రామోజీ రావు పార్థివదేహానికి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాళులర్పించారు. రామోజీ రావు కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఆదివారం ఉదంయ 9 నుంచి 10 గంటల మధ్య రామోజీ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపనున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను సీఎస్ శాంతికుమారి జారీ చేశారు.
సమాజంలో మానవ ధర్మాలు, నీతినిజాయితీలు, ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించిన మహానుభావుడు రామోజీరావు.. తాను నమ్మిన నీతి నిజాయితీలను జీవితాంతం కొనసాగించారని అన్నారు పరుచూరు గోపాలకృష్ణ. అలాంటి మహానుభావుడితో కలిసి పనిచేయం తమ అదృష్టమని.. ఈనాడులో వార్త వచ్చిందంటే అది నిజమని నమ్మకం కలిగించిన గొప్ప వ్యక్తి.. ఆయన భౌతికకాయాన్ని చూస్తుంటే ఇంకా జీవించే ఉన్నారనిపించిందని అన్నారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపున ముగ్గురు సీనియర్ అధికారులు. ఆదివారం నిర్వహించనున్న అంత్యక్రియల కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఆర్పీ సిసోదియా, సాయి ప్రసాద్, రజత్ భార్గవ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పార్థివదేహానికి నివాళి అర్పించనున్న అధికారులు.
రామోజీ రావు తనను ఎంతో అభిమానించేవారని అన్నారు బాబూ మోహన్. ఫిల్మ్ సిటీకి వస్తే కచ్చితంగా కలిసి వెళ్లే వాడినని.. మంత్రి అయిన తర్వాత వెళ్లి కలిస్తే ఎంతో సంతోషించారని.. ఫిల్మ్ సిటీలో కాలానికి తగ్గట్లుగా సరికొత్త మార్పులు తీసుకొచ్చారని అన్నారు.
పత్రికా రంగ లెజండ్, కీర్తిశేషులు రామోజీరావు గారు జర్నలిస్టు విలువలకు గొప్ప అర్థం చెప్పిన వ్యక్తి అని సినీ నటుడు నాగబాబు అన్నారు. ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ సమయంలో సామాన్యుడు తన భావ ప్రకటనా స్వేచ్ఛను వెల్లడించడానికి భయపడే తరుణంలోనూ నిజాలు నిర్భయంగా వెల్లడించిన ఏకైక పత్రికగా ఈనాడును చూశానని అన్నారు. ఆయన పేరుకున్న కీర్తి అజరామరమని.. పత్రికారంగాన్ని ఎంచుకున్న ఎంతో మందిలో స్పూర్తినింపారని.. ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ముందడుగు వేశారని.. రిటర్మెంట్ అన్న పదాన్నే ఆయన ఒప్పుకోరని.. మనిషి బతికున్నంతకాలం పనిచేస్తూనే ఉన్నారని.. ఆయనను కోల్పోవడం యావత్ తెలుగు జాతికి పత్రికా ప్రపంచానికి తీరని లోటని అన్నారు.
రామోజీ రావు గొప్ప దార్శనికుడు… ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయాలను అందుకున్నారని.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు టాలీవుడ్ హీరో నాగార్జున.
ఆదివారం ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీ మృతికి నివాళిగా ఏపీలో రెండు రోజులు (ఆదివారం, సోమవారం) సంతాప దినాలు.
రామోజీ రావు మరణం తెలుగు వారికి పెద్ద విషాదమని అన్నారు నిర్మలా సీతారామన్. రామోజీ రావు మరణవార్త తెలిసి ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలపమని తనను ప్రధాని పంపించారని.. రామెజీ ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల కిందట ప్రధాని కూడా ఆరా తీశారని అన్నారు. రామోజీ ప్రజలకు చేసిన సేవలేంటో ప్రధానికి తెలుసని అన్నారు.
రామోజీ రావు మృతి దిగ్ర్భాంతిని కలిగించిందన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి కలవాలనుకున్నానని.. అంతలోనే ఇలా జరగడం బాధాకరమని అన్నారు. తెలుగు మీడియాలో పనిచేస్తున్న వేలాది జర్నలిస్టులను ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి తయారు చేశారని.. ఫిల్మ్ సిటీ నిర్మించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబసభ్యులకు, ఈనాడు సంస్థల ఉద్యోగులకు సానుభూతి తెలియజేస్తున్న అని అన్నారు.
రామోజీ రావు పార్థివదేహానికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి రామోజీ రావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించి.. రామోజీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
రామోజీ రావు పార్థివదేహానికి నివాళులర్పించారు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షరరూపంలో రాసేవారు. రామోజీ కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలి. అందరూ ఆయనలో గంభీరాన్ని చూస్తే.. నేను చిన్న పిల్లాడిని చూశాను. ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడిని. ఆ సమయంలో ఒక పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకున్నారు. అంతేకాదు ఆయన దాచుకున్న పెన్నులను కూడా చూపించారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు కన్నుమూయం బాధాకరమన్నాకు కేఏ పాల్. తొలిసారి ఈటీవీ ద్వారానే శాంతి సందేశంతో నేను మీ ముందుకు వచ్చాను. శాంతి సందేశాలు మతపరమైనవి కావని దృఢ నిశ్చయంతో రామోజీరావు గుర్తించారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు ఏర్పడిన భారీ నష్టమన్నారు.
ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు మరణవార్త విని బాధపడ్డాను.. రామోజీ ఫిల్మ్ సిటీ ఓ అద్భుతం.. అది షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదు.. ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. అంత దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు మరణించడం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని అన్నారు కమల్ హాసన్..
రామోజీ రావు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు నివాళులు అర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెదేపా అధినేత.. రామెడీ రావు పార్థివదేహానిక నివాళులు అర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించి.. రామోజీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
” నేను ఎక్కువగా గౌరవించే ఒక మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రధాత రామోజీరావు గారు మరణవార్త విని ఎంతో దిగ్ర్భాంతికి లోనయ్యాను. ఆయన ఒక స్పూర్తి ప్రధాత. మీడియా, సినిమా, పరిశ్రమలు ఇలా అన్నిట్లో అగ్రగామిగా నిలిచారు. మీడియా, సినిమా, అనేక ఇతర పరిశ్రమలకు ఆయన చేసిన అసమానమైన సేవలు ఎన్నటికీ మరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు , ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు రామోజీరావు అని పేర్కొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. రామోజీరావు మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీ మమేకమై ఉన్నారని పేర్కొన్నారు.
భారత మీడియా రంగంలో మార్గదర్శిగా నిలిచిన రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. జర్నలిజం, సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రామోజీరావు మరణంపై మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు సంతాపాన్ని ప్రకటించారు. జర్నలిజంలో ఒక ట్రెండ్ సెట్ చేసి నూతన ఒరవడులతో.. నిత్య నూతనంగా మీడియా రంగంలో వెలుగొందిన రామోజీరావు జీవితం ధన్యం అన్నారు జూపల్లి రామేశ్వరరావు. పారిశ్రామికవేత్తగా లక్షలాది మందికి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన.. రామోజీరావు సేవలు చిరస్మరణీయమన్నారు.
రామోజీరావు మరణవార్త టాలీవుడ్‌ను తీవ్రంగా కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించి.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల కోలీవుడ్ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం తెలిపారు. నా గురువు, శ్రేయోభిలాషి అయిన రామోజీ రావు గారి మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. జర్నలిజం, సినిమా, రాజకీయాల్లో గొప్ప కింగ్‌మేకర్‌గా చరిత్ర సృష్టించిన వ్యక్తి. అతను నా జీవితంలో నాకు మార్గదర్శకుడు ప్రేరణ కలిగించిన వ్యక్తి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక అంటూ రజినీకాంత్ రాసుకోచ్చాడు.
I am deeply saddened on hearing the demise of my mentor and well wisher Shri Ramoji Rao Garu. The man who created history in Journalism, Cinema and a great kingmaker in Politics. He was my guide and inspiration in my life. May his soul rest in peace. @Ramoji_FilmCity
— Rajinikanth (@rajinikanth) June 8, 2024
“మా జీవితాలలో చెరగని ముద్ర వేసిన రామోజీ రావు గారు మరణించారనే బాధాకరమైన వార్త విని హృదయం బరువెక్కింది. ఆయన ముందుచూపు, అంకితభావం, పనిలో నిబద్ధత ఎంతోమందికి అనుసరనీయమైంది. ప్రతి రంగంలోనూ కమిట్‌మెంట్‌తో ముందుకు సాగి 100 శాతం విజయాల్ని అందుకున్నారు. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారు. ఆయన జీవితం మొత్తం చేసిన కృషి రాబోయే రోజుల్లో మనకు స్ఫూర్తినిస్తుంది. మార్గనిర్దేశం చేస్తుంది. ఈ తీరని దుఃఖ సమయంలో, మేము రామోజీరావు గారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అని ప్రముఖ పుస్తక రచయిత శ్రీనాథాచారి పేర్కొన్నారు.
‘రామోజీరావు మరణంతో మీడియా, వినోద రంగం ఓ లెజెండ్‌ను కోల్పోయింది. ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ న్యూస్ నెట్‌వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచిన సృజనాత్మక వ్యాపారవేత్త ఆయన. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారు. పద్మవిభూషణ్ సత్కారం అందుకున్నారు. మీడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.
రామోజీరావు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ఓం శాంతి’ అంటూ సంతాపం తెలిపారు చిరంజీవి. రామోజీరావు నిజమైన దార్శనికుడిగా ఉన్నారన్నారు హీరో వెంకటేశ్. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారన్నారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు సినీ నటుడు వెంకటేశ్
రామోజీరావు మృతి చాలా బాధాకరమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫిలింసిటీలో ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. రామోజీ కుటుంబాన్ని ఓదార్చారు. మీడియా, సినిమా రంగాల్లో ఆయన కృషి మరువలేనిదన్నారు. రైతులు, మహిళలకు అండగా నిలిచారని చెప్పారు. అన్ని రంగాల్లో తన మార్క్ చూపించారని గుర్తు చేసుకున్నారు. రామోజీ మృతి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు పొంగులేటి.
— రామోజీరావు స్వగ్రామం కృష్ణాజిల్లా పెదపారుపూడిలో విషాదఛాయలు నెలకొన్నాయ్. రామోజీరావు జ్ఞాపకాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు గ్రామస్తులు. రామోజీ ఫౌండేషన్ ద్వారా గ్రామంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను గుర్తుచేసుకుంటున్నారు.
— రామోజీ ఫౌండేషన్ ద్వారా పెదపారుపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు రామోజీరావు. జెడ్పీ స్కూల్, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్, పశువైద్యశాల, వ్యవసాయ కేంద్రం… ఇలా అనేక భవనాలను నిర్మించి ఇచ్చారు. సుమారు 20కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు.
–రామోజీరావుకు నివాళులు అర్పించారు ప్రముఖ దర్శకులు రాజమౌళి. ఆయనతో పాటు సంగీత దర్శకులు కీరవాణి కూడా రామోజీరావుకు నివాళి అర్పించారు. రామోజీది మరణం కాదు నిర్యాణం అన్నారు. ఎన్నో రంగాల్లో విశేష సేవలు అందించిన రామోజీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాజమౌళి.
పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరమన్నారు మెగా హీరో రామ్ చరణ్. రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రీకరణలో ఉన్న రామ్ చరణ్ అక్కడి నుంచే రామోజీకి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, ఇతర మూవీ యూనిట్ 2 నిమిషాలు మౌనం పాటించారు. రామోజీ రావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు.
‘‘రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. ఆయన ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు
అక్షర యోధుడు రామోజీ మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బహుముఖ ప్రజ్ఞాశాలి, అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారన్నారు. ప్రజాపక్షం వహిస్తూ.. జనచైతన్యాన్ని కలిగించారని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.., ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు పవన్.
అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ నుంచి సీఎస్‌కు ఆదేశాలు అందాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు… pic.twitter.com/QEfjfOuN2E
— Revanth Reddy (@revanth_anumula) June 8, 2024
ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 12.30కి ఫిల్మ్ సిటీలో రామోజీరావు భౌతిక కాయానికి నివాళి అర్పించనున్నారు.
Saddened by the passing of Shri Ramoji Rao garu.
His remarkable contributions to Telugu media and journalism is commendable.
My deepest condolences to his family members.
Om Shanti 🙏 pic.twitter.com/zJzTyOMbL7
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) June 8, 2024
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm
— Jr NTR (@tarak9999) June 8, 2024
“అతి సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించి అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన రామోజీరావు గారి మరణం తీరని లోటు. వామపక్ష భావజాలం కలిగిన రామోజీరావు గారు తన జీవితాంతం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో బతికిన వ్యక్తి. తలపెట్టిన ఏ పనిలో అయినా సరే అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు. పత్రిక, సినిమా, టీవీ తదితర రంగాల్లో రామోజీరావు గారు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తాయి. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు. రామోజీరావు గారి కుటుంబానికి, రామోజీ సంస్థల ఉద్యోగులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను” అని ఈటల పేర్కొన్నారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా… pic.twitter.com/NQIQjSfDZZ
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 8, 2024