ఘనంగా రామానుజాచార్యుల 1008వ జయంతి ఉత్సవాలు! పాల్గొన్న తెలంగాణ గవర్నర్‌

రామానుజాచార్యుల 1008వ జయంతి ఉత్సవాలు ముచ్చింతల్‌లో వైభవంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్‌ పాల్గొన్న ఈ వేడుకల్లో, సువర్ణ రామానుజులకు అభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, రథోత్సవం జరిగాయి. త్రిదండి చిన్న జీయర్‌ స్వామి, రామానుజుల సామాజిక సమత, మహిళలకు గుర్తింపు లభించడంలో పాత్రను గుర్తుచేశారు.

ఘనంగా రామానుజాచార్యుల 1008వ జయంతి ఉత్సవాలు! పాల్గొన్న తెలంగాణ గవర్నర్‌
Chinna Jeeyar Swamy

Updated on: May 02, 2025 | 8:32 PM

ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించిన జగద్గురువులు భగవత్‌ రామానుజులు, త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల ఒక వెయ్యి 8వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ముచ్చింతల్‌ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పాల్గొన్నారు. ఉదయం 7.30 గంటల నుంచి సువర్ణ రామానుజులకు అభిషేకంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. సమతాస్ఫూర్తి కేంద్రంలో విరాట రూపంలోని శ్రీరామానుజుల విగ్రహాన్ని భక్తులు దర్శించి తరించారు. ‘విశ్వరూపధర రామానుజ’ అంటూ పరవశించారు. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగింది.

అనంతరం..సమతా స్ఫూర్తి కేంద్రం నుంచి.. భగవత్‌ రామానుజ స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. భగవద్రామానుజాచార్యులు 120 సంవత్సరాలపాటు ఈ లోకాన్ని తరింపచేశారని త్రిదండి చిన్న జీయర్‌ స్వామి. సమాజంలో ఉనికి లేకుండా ఉన్న ఆలయాలను..ప్రపంచమంతా సేవించుకునేలా చేసిన ఘనత శ్రీరామానుజులకే దక్కతుందని గుర్తుచేశారు. రామానుజ స్వామి వల్లనే సమాజంలో మహిళలకు గుర్తింపు లభించిందన్నారు. వెయ్యేళ్ల క్రితమే ఆధ్యాత్మికంగా, సామాజికంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన రామానుజులకు కృతజ్ఞతగా లంబాడి, ఆదివాసీలు సమతా గీతిక పేరుతో నృత్యప్రదర్శన నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి