ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు! బర్డ్ ఫ్లూ కారణంగా హలీంకు ఫుల్ డిమాండ్..

రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో హలీంకు డిమాండ్‌ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయంతో మటన్ హలీంకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దీంతో ధరలు కూడా 200-250 రూపాయల నుండి 300 రూపాయలకు పెరిగాయి. అయినప్పటికీ, హలీం ప్రియులు ధర పెరిగినా కూడా వెనకాడటం లేదు. వ్యాపారులు నాణ్యతను తగ్గించకుండా అమ్ముతున్నట్లు తెలిపారు.

ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు! బర్డ్ ఫ్లూ కారణంగా హలీంకు ఫుల్ డిమాండ్..
Haleem

Edited By: SN Pasha

Updated on: Mar 03, 2025 | 10:15 AM

రంజాన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది హలీం. ఈ హలీమ్ తింటానికి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వారు కూడా ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ హలీమ్ అంటే అంత ఫేమస్ మరి. అయితే శనివారం నెలవంక కనిపించడంతో నగరంలో ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి అని తెలియజేస్తూ.. మసీదులలో సైరెన్ కూడా మోగించారు. ఇక సైరెన్ మోగడంతో పాతబస్తీలో సందడి వాతావరణం నెలకొంది. మసీదులను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. ఉపవాస దీక్షల తో డ్రై ఫ్రూట్స్, పండ్లు ధరలు అమాంతం పెరిగాయి. ఇక రంజాన్ అంటేనే హలీం కదా దీంతో నగరంలో ప్రతి గల్లీలో హలీం దుకాణాలు వెలిశాయి.

ఉపవాస దీక్షల ముగిసిన తర్వాత హలీం షాపుల వద్ద హలీం ప్రియులు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం ఉండటంతో చాలా మంది మటన్ హలీమ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు నాన్ వెజ్ ప్రియులు. దీంతో హలీంకు భారీ డిమాండ్ పెరిగిందని హలీమ్‌ వ్యాపారులు చెబుతున్నారు. రంజాన్ సమయంలో హలీం 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పిస్తా హౌస్ లాంటి వాటిలో అమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా 300 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్తున్నారు అమ్మకదారులు. ఎంతో పోషక విలువలు కలిగినటువంటి హలీం ను తినడానికి ధర ఎంతైనా సరే వెనకాడడం లేదు హలీమ్‌ ప్రియులు. మరోవైపు బర్డ్ ఫ్లూ కారణంగా హలీం డిమాండ్‌ పెరిగి కదా అని నాణ్యత తగ్గించి అమ్మే ప్రసక్తే లేదని తెలుపుతున్నారు వ్యాపారులు. మరి మీరు కూడా హలీమ్‌ను టెస్ట్‌ చేయలనుకుంటే వెంటనే చేసేయండి. లేదంటే మరింత ధర పెరిగే అవకాశం కూడా ఉంది.