Telangana: పరీక్ష రాసి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణం.. ఈ రోజు అవే పరీక్షల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన వైనం

|

Jun 29, 2022 | 1:01 PM

ఇంటర్ పరీక్ష రాసి వస్తున్న క్రమంలో.. రోడ్డు ప్రమాదంలో ఆ విద్యార్థిని మరణించింది. అయితే.. తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మరణించిన ఆ విద్యార్థిని ఇంటర్ టాపర్‌గా నిలించింది.

Telangana: పరీక్ష రాసి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణం.. ఈ రోజు అవే పరీక్షల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన వైనం
Rajeshwari
Follow us on

Inter Topper Rajeshwari: ఆ విద్యార్థిని ఎన్నో కలలు కన్నది.. కష్టపడి చదివి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు, కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కానీ విధి ఆడిన వింత నాటకంలో ప్రాణాలు కోల్పోయింది. ఇంటర్ పరీక్ష రాసి వస్తున్న క్రమంలో.. రోడ్డు ప్రమాదంలో ఆ విద్యార్థిని మరణించింది. అయితే.. తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మరణించిన ఆ విద్యార్థిని ఇంటర్ టాపర్‌గా నిలించింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన నల్లన్న కుమార్తె రాజేశ్వరి (18) జిల్లా కేంద్రంలోని గొనుపాడు కేజీబీవీలో ఇంటర్‌ చదివింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు మే 19న తండ్రి నల్లన్న (42) కుమార్తె రాజేశ్వరిని బైక్‌పై ఎక్కించుకుని గద్వాల నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు.

కాగా, మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాజేశ్వరి ఎంపీసీలో 867 మార్కులు సాధించి జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో టాపర్‌గా నిలిచింది. ఇంటర్‌లో రాజేశ్వరి ప్రతిభను గుర్తు చేసుకుని కుటుంబసభ్యులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాజేశ్వరి బతికుంటే ఎంతో సంబరపడిపోయేదని.. రాజేశ్వరి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆమె తల్లి పద్మమ్మ విషాదంలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి

Inter Memo

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..