AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె అమాయకత్వమే వారికి బిజినెస్.. బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఏం చేశారంటే..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్రపూజలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో మహిళను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనారోగ్యాన్ని మంత్రాలు, పూజలతో నయం చేస్తామంటూ కరీంనగర్‌కు చెందిన శ్యామ్‌ కుమార్‌, వేములవాడ అగ్రహారానికి చెందిన లక్ష్మీరాజం బాధితురాలి నుంచి విడతల వారీగా ఏకంగా రూ.62 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆమె అమాయకత్వమే వారికి బిజినెస్.. బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఏం చేశారంటే..
Black Magic Scam
Shaik Madar Saheb
|

Updated on: Sep 01, 2026 | 11:15 AM

Share

క్షుద్ర పూజల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్రపూజల పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఓ మహిళను నమ్మించి ఏకంగా 62 లక్షల రూపాయలు వసూలు చేశారు. తాను మోసపోయానని గమనించిన మహిళ.. వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాల ప్రకారం.. ఓ మహిళ గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది.. ఈ క్రమంలోనే.. చేతబడి, క్షుద్రపూజల పేరుతో.. కరీంనగర్‌కు చెందిన శ్యామ్‌ కుమార్, వేములవాడ అగ్రహరంకి చెందిన లక్ష్మీరాజం.. ఆ మహిళను ఆశ్రయించారు.. అనారోగ్యాన్ని క్షుద్ర పూజలతో నయం చేస్తామంటూ మహిళ నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో.. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలను గీస్తూ ఆ మహిళను నమ్మించారని తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కరీంనగర్‌కు చెందిన శ్యామ్‌ కుమార్, వేములవాడ అగ్రహరంకి చెందిన లక్ష్మీరాజంను అరెస్ట్‌చేసి వాళ్ల నుంచి 30 లక్షల 50 వేల రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్లు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పూజలు, గుప్తనిధుల పేరుతో ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వీడియో చూడండి..

Follow Us
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?