తెలంగాణ ప్రజలు అలెర్ట్.. పలు ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉండనుండగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో నాలుగు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఆదిలాబాద్(Adilabad), కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల(Mancherial), నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలపై తీవ్రమైన వడగాలల ఎఫెక్ట్ ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే వాతావరణ కేంద్రం ఇంకో కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. ఈదురుగాలులతో అక్కడక్కడ వర్షం పడే చాన్స్ ఉందని తెలిపారు. ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రభావంతో గత 3 రోజులుగా ఉన్న ఎండల తీవ్రత నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది.
Also Read: Telangana: మతిస్థిమితం లేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం..