తెలంగాణలో మే 5, 6 తేదీల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కేరళ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాప్తించి ఉన్నది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. వాతావరణ మార్పుల కారణంగా మరో రెండురోజులపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ అక్కడక్కడ వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే ఓవైపు మండుతున్న ఎండలతో ప్రజలు సతమతమవుతున్నా వర్షాలు కురుస్తుండటంతో కాస్త సేదతీరుతున్నారు. అయితే అకాల వర్షాలు మాత్రం రైతన్నలను నిండా ముంచుతున్నాయి. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వడగండ్లు పడుతుండటంతో పంటలకు తీవ్ర నాష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన వరి ధాన్యం కల్లాల్లోనే తడిసి ముద్దవుతుంది. మామిడి కాయలు నేలరాలడంతో తీవ్రంగా నష్టపోతున్నారు మామడి రైతులు. మరో రెండు రోజులపాటు వర్షాల హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also Read:మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఆ రిజర్వేషన్లు చట్టవిరుద్ధం అంటూ..