Rain Alert: రైతన్నా ఇది విన్నారా..! తెలంగాణకు వాన కబురు వచ్చేసింది…

తెలంగాణలో జూన్ 23, సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, హైదరాబాద్, తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.

Rain Alert: రైతన్నా ఇది విన్నారా..! తెలంగాణకు వాన కబురు వచ్చేసింది...
Rain Alert

Updated on: Jun 23, 2025 | 8:36 AM

వచ్చింది వాన కబురు.. అవును తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులను కూడా వీసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జూన్ 24న వీటికి అదనంగా నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు పడే చాన్స్ ఉందంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున.. ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో నేడు ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. సిటీలోని ప్రజలు ముందు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

మే 27నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ వర్షాలు మాత్రం ఆశాజనకంగా లేవు. జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఇటీవల చిరుజల్లులు పడటంతో వెదర్ కాస్త కూల్ అయింది. కానీ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న ప్రకటన రైతులకు గుడ్ న్యూస్ చెప్పినట్లైంది. దీంతో వారు విత్తనాలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి