ఎండా కాలం వర్షంపడిందంటే దాని తీవ్రత మామూలుగా ఉండదు. అందులోనూ ఎన్నికల సమయంలో వాన గండం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల అవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ పేర్కొంది.
నిన్న మొన్నటివరకు మండే ఎండలపై అలెర్ట్‌లు.. ఇప్పుడు.. దంచి కొట్టే వానలపై అలెర్ట్‌లు వస్తున్నాయి.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పోలింగ్ రోజు మే13వ తేదీన వర్షం ముప్పు పొంచి ఉంది. అది ఓటింగ్‌పైనా ప్రభావం చూపే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పుడు వర్షాలు పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్. సోమవారం భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావ రణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…