Rain Alert: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్.. వచ్చే 4 రోజులపాటు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఇదే..

Rain Alert for Andhra Pradesh and Telangana: ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్.. వచ్చే 4 రోజులపాటు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఇదే..
Rain Alert

Updated on: Nov 08, 2023 | 8:01 AM

Rain Alert for Andhra Pradesh and Telangana: ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వచ్చే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న మూడు రోజులు హైదరాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్,నల్గొండ, నారాయణపేట, ములుగు,వరంగల్, సూర్యాపేట, కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్‌లో నిన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.

ద్రోణి ప్రభావంతో అటు ఏపీలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం విభాగం సూచించింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..