వేగంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. ఎంత మంది, ఏం మట్టి ఉపయోగించారో తెలుసా..?

వర్షాలు వరదలు సృష్టించిన బీభత్సం నుండి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రోడ్డు మార్గాలు - రైలు మార్గాల్లో రాకపోకలు కొనసాగుతున్నాయి. దాదాపు మూడు రోజులపాటు స్తంభించిన రైళ్ల రాకపోకలు ట్రాక్ పునరుద్ధరణతో మళ్ళీ కొనసాగుతున్నాయి.

వేగంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. ఎంత మంది, ఏం మట్టి ఉపయోగించారో తెలుసా..?
Railway Track
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Sep 05, 2024 | 11:01 AM

వర్షాలు వరదలు సృష్టించిన బీభత్సం నుండి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రోడ్డు మార్గాలు – రైలు మార్గాల్లో రాకపోకలు కొనసాగుతున్నాయి. దాదాపు మూడు రోజులపాటు స్తంభించిన రైళ్ల రాకపోకలు ట్రాక్ పునరుద్ధరణతో మళ్ళీ కొనసాగుతున్నాయి. వరంగల్ – మహబూబాబాద్ మధ్య చెల్లాచెదురైన రైల్వే ట్రాక్ ను రైల్వే సిబ్బంది మూడు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి పునరుద్ధరించారు. మొత్తం 15 ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ ధ్వంసం అవ్వగా, డే అండ్ నైట్ శ్రమించి మరమ్మతులు పూర్తి చేశారు.

మొత్తం 15 ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాక్‌లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు రైల్వే సిబ్బంది. 750 మంది అధికారులు, సిబ్బంది, కార్మికులు రాత్రి, పగలు శ్రమించి పనులు పూర్తి చేశారు. భారీ యంత్రాల సాయంతో ట్రాక్ మరమ్మతు విజయవంతం చేశారు. ట్రాక్‌లు పునరుద్ధరించడానికి 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, 6 వేల క్యూబిక్ మీటర్ల కంకర మిక్సింగ్ ఉపయోగించారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో దేశంలోనే రికార్డ్ స్థాయి 45.65 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. ఆ వర్షాలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి.. అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. దెబ్బతిన్న రోడ్లతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రైల్వే ట్రాక్ లు చెల్లాచెదురయ్యాయి. ముఖ్యంగా తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య మొత్తం 15 ప్రాంతాల్లో ట్రాక్ దెబ్బతిన్నాయి. ఇంటికన్నె, తాళ్ళపూసపల్లి వద్ద భారీ ఎత్తున నష్టం జరిగింది. ట్రాక్ బెస్మెంట్ మొత్తం కొట్టుకుపోయింది.

ఇక్కడ రైల్వే ట్రాక్ చెల్లాచెదురవడంతో ఉత్తర భారతదేశానికి – దక్షిణ భారతదేశానికి మధ్య రాకపోకలు స్తంభించాయి. దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్ల రద్దు చేసింది. పలు రైళ్ళను దారి మళ్ళించారు. మూడు రోజులపాటు రైలు కూత వినిపించలేదు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కరువయ్యారు. ట్రాక్ పునరుద్ధరణ కోసం నిర్విరామంగా శ్రమించిన రైల్వే సిబ్బంది, అధికారులు ఎట్టకేలకు ట్రాక్ మరమ్మతులు పూర్తి చేశారు.

అయితే ట్రాక్ పునరుద్ధరణ కోసం మొత్తం 750 మంది అధికారులు సిబ్బంది నిర్విరామంగా డే అండ్ నైట్ శ్రమించారు. వరంగల్ – ఖమ్మం మద్య రైళ్ల రాకపోకలు యథావిధిగా పునరుద్ధరించారు. భారీ యంత్రాల సహాయంతో ట్రాక్ మరమ్మత్తులు విజయవంతం చేశారు. ట్రాక్‌‌ల పునరుద్ధరించడానికి 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి, 5,000 క్యూబిక్ మీటర్ల బ్యాలస్ట్, 6,000 క్యూబిక్ మీటర్ల కంకర మిక్సింగ్ ఉపయోగించి రైల్వే ట్రాక్ మరమ్మత్తులు చేశారు. 26 ఇటాచ్‌లు, 15 జేసీబీలు, 22 ట్రిప్పర్స్, డీజర్స్ సహాయంతో నిర్విరామంగా శ్రమించి ట్రాక్ పునరుద్ధరించారు. ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం రైళ్లు పరిగెడుతున్నాయి.

వీడియో చూడండి..

నిర్విరామంగా శ్రమించి ట్రాక్ మరమ్మతులు పూర్తి చేసిన రైల్వే అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. నైట్ పెట్రోలింగ్, ట్రాక్ మెన్ అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పిందని వారిని అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..