దీపం ఆకృతిలో.. ప్రపంచ స్థాయిలో ‘అమరవీరుల స్మృతి చిహ్నం’

|

Sep 18, 2020 | 3:50 PM

భాగ్యనగరం నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ ఒడ్డున దీపం ఆకారంలో ప్రపంచ స్థాయిలో నిర్మితం కానుంది తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం అని చెప్పారు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి.

దీపం ఆకృతిలో.. ప్రపంచ స్థాయిలో అమరవీరుల స్మృతి చిహ్నం
లంకలో ఉన్నోళ్లంతా రాక్షసులే, ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని నిన్న కామెంట్‌ చేశారు ప్రశాంత్‌రెడ్డి. నీళ్ల కోసం యుద్ధం తప్పదని హెచ్చరించారు. వైఎస్‌ నీళ్ల దొంగ అని, జగన్‌ గజదొంగ అని కామెంట్‌ చేశారు.
Follow us on

భాగ్యనగరం నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ ఒడ్డున దీపం ఆకారంలో ప్రపంచ స్థాయిలో నిర్మితం కానుంది తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం అని చెప్పారు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ‘తెలంగాణ రాష్ట్ర పరిపాలన కేంద్రం ఎదురుగానే.. నిత్యం అమరుల త్యాగాలను స్మరించుకుంటూనే తెలంగాణ అభివృద్ధికి పునరంకితం’ ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరవీరుల స్థూపానికి స్ఫూర్తి అని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నంగా నిర్మిస్తోన్న ఈ కట్టడం మరో ఆరు నెలల్లోనే పూర్తికాబోతుందని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. అమరవీరుల స్మృతి చిహ్నంలో ఎన్నో విశేషాలు ఉంటాయని.. బయటకి దీపం లా కనిపించే ఈ కట్టడం మొత్తంగా 3 లక్షల స్క్వేర్ ఫీట్ స్థలంలో ఉండబోతుందని తెలిపారు. రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, భారీ పార్కింగ్ స్థలం ఇలా.. రికార్డు స్థాయిలో ఈ నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.