Watch Video: యముడికే ధమ్కీ.. రైలు వేగంలో మృత్యుగండం దూసుకొచ్చినా..

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఆగి ఉన్న ట్రైన్ కింద దూరి పట్టాలు దాటేందుకు ప్రయత్నించగా ఆ ట్రైన్ ఒక్కసారిగా కదిలింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఊహించని రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ క్షణంలో అతనికి తట్టిన ఆలోచనే అతని మృత్యుంజయుని చేసింది.. ఇంతకూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు అతను ఏం చేశాడో తెలుసుకుందాం పదండి.

Watch Video: యముడికే ధమ్కీ.. రైలు వేగంలో మృత్యుగండం దూసుకొచ్చినా..
Train Viral Video

Edited By: Anand T

Updated on: Nov 14, 2025 | 1:58 PM

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఆగి ఉన్న ట్రైన్ కింద దూరి పట్టాలు దాటేందుకు ప్రయత్నించగా ఆ ట్రైన్ ఒక్కసారిగా కదిలింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఊహించని రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.. రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఆగి ఉంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే రైలు పట్టాల కింద నుండి దూరి అవతల వైపు వెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. కానీ అతను రైలు కింద నుండి దూరుతున్న క్రమంలో అకస్మాత్తుగా రైలు కదిలింది.. ఈ క్రమంలో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఆ వ్యక్తి వెంటనే రైలు కింద పట్టాల మీద పడుకున్నాడు.

అది చూసిన అక్కడున్న జనాలంతా షాకయ్యారు. అతను రైలు కిందపడి చనిపోయాడు కావచ్చు అని కేకలు పెడుతున్నారు.. కానీ అతను మాత్రం చాకచక్యంగా మృత్యుంజయుడు అయ్యాడు.. రైలు పట్టాలపై బోర్లా పడుకొని గూడ్స్ రైలు అక్కడి నుండి వెళ్లిన తర్వాత క్షేమంగా లేచి వెళ్లిపోయాడు. గూడ్స్ రైలు కింద చిక్కుకున్న ఈ వ్యక్తి ఎవరూ అనేది ఇప్పటివరకు ఇంకా ఎవరికి తెలియలేదు.. రైలు కింది నుండి దాటడం నేరం కాబట్టి వెంటనే ప్రాణాలతో బయటపడి అక్కడినుండి లేచి వెళ్లిపోయాడు.

ఈ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారాయి. అయితే వీడియో చూసిన కొందరూ.. ఆ క్షణం అతనికి వచ్చిన ఆలోచన ప్రాణాలు కాపాడింది.. ఉపాయంతో మృత్యుంజయుడు అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం రైలు కింద నుండి అలా దాటడం తప్పు కాబట్టి.. అతనిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.