ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణ(Telangana)లో కలపాలంటూ అఖిలపక్షం నేతలు చేస్తున్న ఆందోళన ఉద్ధృతమవుతోంది. భద్రాచలం(Bhadrachalam) బ్రిడ్జి సెంటర్ వద్ద జాతీయ రహదారిపై నిరసనకారులు రాస్తారోకో చేపట్టారు. దీంతో బ్రిడ్జిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కన్నాయిగూడెం, పీచుకులపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఏటపాక పంచాయతీలను భద్రాచలంలో కలిపేంతవరకు ఉద్యమం అపేది లేదని నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం చాలా నష్టపోయిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే దీనికి కారణం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, అఖిల పక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఎట్టకేలకు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు.
Also Read
Chanakya Niti: ఒక వ్యక్తి ధనవంతుడు కావడానికి ఈ లక్షణాలు కలిగి ఉండాలంటున్న చాణక్యుడు..
Before Marriage: పెళ్లికి ముందు ఈ 4 టెస్ట్‌లు తప్పనిసరి.. కాబోయే వధూవరులిద్దరికి అవసరం..?
Before Marriage: పెళ్లికి ముందు ఈ 4 టెస్ట్‌లు తప్పనిసరి.. కాబోయే వధూవరులిద్దరికి అవసరం..?