
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, రోగులు వారి అటెండెన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఆసుపత్రిలో ఓ సైకో మద్యం మత్తులో కత్తితో వీరంగం సృష్టించడం చూసి అంతా పరుగులు పెట్టారు. ఆస్పత్రిలో ఫర్నీచర్ అంతా ధ్వంసం చేసిన సైకో.. చివరకు ఆపరేషన్ థియేటర్లకు వెళ్లి కత్తితో గొంతు కోసుకున్నాడు.
సైకో వీరంగం సృష్టించిన ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. పీకలదాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చాడు. ఆస్పత్రి ఆవరణలో తన చేతిలో కత్తి పట్టుకుని హంగామా చేశాడు. ఆస్పత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేసి అందరినీ పరుగులు పెట్టించాడు.
కత్తితో హల్ చల్ చేసిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడిగా గుర్తించారు.. మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చాడు.. అతని ఎవరు పట్టించు కోకపోవడంతో ఇక శివమెత్తాడు. ఆస్పత్రిలో పరికరాలు ధ్వంసం చేసి, రోగులను కత్తితో బెదిరించి పరుగులు పెట్టించాడు. కత్తితో పొడుస్తానని బెదిరించడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువులు భయబ్రాంతులకు గురై ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అతన్ని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది నానా తండాలు పడ్డారు.
వీరంగం సృష్టించిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని గొంతు కోసుకున్నాడు. ఆసుపత్రి సెక్యురిటీ సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి ఆ సైకోను బంధించి పట్టుకుని చికిత్స అందించారు. సెక్యూరిటీ సిబ్బంది వారి ప్రాణాలు తెగించి ఆ సైకోను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అతనే కత్తితో గొంతు కోసుకోవడంతో ఇప్పుడు ఆ సైకో పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..