Durga Matha Shobha Yatra: భైంసాలో దుర్గాదేవి శోభాయాత్రలో వివాదం.. నడిరోడ్డుపై విగ్రహాలతో నిరసన.. చివరకు..

|

Oct 07, 2022 | 6:59 AM

భక్తుల పై పోలీసులు దాడి చేసారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించిన భక్తులు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే విగ్రహాలను నిలిపి నిరసన చేపట్టారు. దాంతో ఏ ఎస్పీ కిరణ్ కారే రంగంలోకి దిగారు.

Durga Matha Shobha Yatra: భైంసాలో దుర్గాదేవి శోభాయాత్రలో వివాదం.. నడిరోడ్డుపై విగ్రహాలతో నిరసన.. చివరకు..
Shobha Yatra
Follow us on

నిర్మల్ జిల్లాలో భైంసాలో దుర్గాదేవీ శోభాయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. అమ్మవారి విగ్రహాలను నడిరోడ్డుపైనే నిలిపివేసిన భక్తులు నిరసనకు దిగారు. శోభాయాత్ర జరిపే ప్రక్రియలో భక్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భక్తుల పై పోలీసులు దాడి చేసారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించిన భక్తులు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే విగ్రహాలను నిలిపి నిరసన చేపట్టారు. దాంతో ఏ ఎస్పీ కిరణ్ కారే రంగంలోకి దిగారు. భక్తులకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. కాగా, ఈ ఘటన పై పూర్తి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులతో చర్చలు సఫలం కావటంతో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర తిరిగి ప్రారంభమైంది. వివాదం సద్దుమనగటంతో అనంతరం దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా సాగింది.

భైంసా పట్టణంలోని ఆయా కూడళ్లలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాలతో మండపాల నిర్వాహకులు భారీ శోభాయాత్ర నిర్వహించారు. ముథోల్‌ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి, ఎస్పీ ఎస్పీ చల్లా ప్రవీణ్‌కుమార్‌, భైంసా ఏఎస్పీ కిరణ్‌ఖరే, డీసీసీ అధ్యక్షుడు రామారావుపటేల్‌, పట్టణ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు విలాస్‌గాదేవార్‌, కార్యదర్శి డా.రామకృష్ణగౌడ్‌, ఏఎంసీ ఛైర్మన్‌ పి.కృష్ణ, స్థానిక భవానిచౌక్‌(ఐబీఏరియా)లో దుర్గామాతకు పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర గడ్డెన్న జలాశయం వరకు నిర్వహించి అక్కడ అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి క్రేన్‌ సహాయంతో నిమజ్జనం చేశారు. జిల్లాకేంద్రంలోనూ వందలాది మంది యువత, చిన్నారులు, మహిళలు శోభాయాత్రలో పాల్గొని భక్తిగీతాలు, నృత్యాలు, ఆటపాటలతో అలరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..