Osmania University: లీజు పేరుతో ఓయూ స్థలాలపై ప్రైవేటు వ్యక్తుల కన్ను.. ఆ స్థలంలో ఏ నిర్మిస్తున్నారంటే..

|

Jan 08, 2022 | 7:57 AM

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ భూములు ప్రైవేటుకు అన్యక్రాంతం అవుతున్నాయి. చదువుల పూతోటలో కూడా కబ్జారాయుళ్లు చేరిపోతున్నారు.

Osmania University: లీజు పేరుతో ఓయూ స్థలాలపై ప్రైవేటు వ్యక్తుల కన్ను.. ఆ స్థలంలో ఏ నిర్మిస్తున్నారంటే..
Follow us on

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ భూములు ప్రైవేటుకు అన్యక్రాంతం అవుతున్నాయి. చదువుల పూతోటలో కూడా కబ్జారాయుళ్లు చేరిపోతున్నారు. కొత్తగా వస్తున్న వీసీలు కూడా తమకు ఇష్టమైన వారికి దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. ఇది కొత్తేమి కాదు.. వర్సిటీకి ఎప్పుడు కొత్త వీసీ వచ్చినప్పుడల్లా.. ఈ దొంగలు కొత్త కొత్త దారుల్లో వస్తుంటారు. అందులో భూములను కారు చౌకగా కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే వచ్చిన కొత్త వీసీ కొత్త వివాదాలకు తెరలేపారు. అత్యంత విలువైన భూములను లీజుల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. జామైఉస్మానియా సమీపంలో ఉన్న నాన్‌ టీచింగ్‌ హోమ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫంక్షన్‌ హాల్‌ను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అంతే కాకుండా మాణికేశ్వర్‌ నగర్ సమీపంలో పెట్రోల్‌ పంపు పెట్టుకునేందుకు ప్రైవేటు సంస్థకు స్థలాన్ని లీజుకు ఇచ్చారు. ఈ ఒప్పందాపై ఇప్పుడు విద్యార్థులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే.. యూనివర్సిటీకి ఆదాయం కోణం చూస్తే.. వీసీ తీసుకుంటున్న నిర్ణయాలు మంచివే అయినా.. విలువైన స్థలాలు ప్రైవేటు సంస్థలకు ఒక్కసారి బదులాయింపు జరిగితే.. మళ్లీ తిరిగి వచ్చే ఛాన్స్‌ ఉండదని వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా ఇలానే లీజుల పేరుతో వందల ఎకరాలు ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ఉదంతాలను కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేటు సంస్థలకు అప్పగించిన స్థలాలను వెనక్కి తీసుకోవాలని.. యూనివర్సిటీలో ఉన్న విలువైన భూములను కాపాడేందుకు గోడలను నిర్మించాలని కోరుతున్నారు.

Also read:

Dangerous Area: భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే.. ఇప్పటి వరకు వెళ్లిన వందలాది విమానాలు తిరిగి రాలేదట..!

Family Clashes: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ.. అర్థరాత్రి వేళ అతని భార్య ఏం చేసిందంటే..

Sugar Craving: ఎల్లప్పుడూ తీపి తినాలనిపిస్తుందా..? అయితే ప్రమాదమే.. ఏం చేయాలో తెలుసుకోండి