Srisailam: శ్రీశైలం నల్లమల ఘాట్‌రోడ్‌లో ఘోర ప్రమాదం.. బోల్తాపడ్డ ప్రైవేట్ బస్

|

May 06, 2023 | 12:40 PM

శ్రీశైలం నల్లమల ఘాట్‌రోడ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ ప్రాంతానికి చెందిన భక్తులు.. ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేసుకుని శ్రీశైలం దర్శనానికి వెళ్లారు.

Srisailam: శ్రీశైలం నల్లమల ఘాట్‌రోడ్‌లో ఘోర ప్రమాదం.. బోల్తాపడ్డ ప్రైవేట్ బస్
Accident
Follow us on

శ్రీశైలం నల్లమల ఘాట్‌రోడ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ ప్రాంతానికి చెందిన భక్తులు.. ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేసుకుని శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో నల్లమల ఘాట్ రోడ్‌ చేరుకోగా.. బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 10 మందికి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ శ్రీశైలం, సున్నిపెంట ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..