Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: సుదీర్ఘ నిరీక్షణకు శుభం కార్డ్.. రేపే కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు పీఎం మోదీ శంకుస్థాపన.. ప్రాజెక్టు ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడింది. కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు రాబోతోంది. వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌తో పాటు, వ్యాగన్ల తయారీ ప్రాజెక్టును కూడా ఇండియన్‌ రైల్వే ఏర్పాటు చేయనుంది. 3 దశాబ్దాల క్రితం కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ ఇతర రాష్ట్రాలకు తరలిపోగా..

Warangal: సుదీర్ఘ నిరీక్షణకు శుభం కార్డ్.. రేపే కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు పీఎం మోదీ శంకుస్థాపన.. ప్రాజెక్టు ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
PM Modi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 07, 2023 | 6:28 AM

ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడింది. కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు రాబోతోంది. వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌తో పాటు, వ్యాగన్ల తయారీ ప్రాజెక్టును కూడా ఇండియన్‌ రైల్వే ఏర్పాటు చేయనుంది. 3 దశాబ్దాల క్రితం కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ ఇతర రాష్ట్రాలకు తరలిపోగా.. దాని స్థానంలో స్థానంలో వ్యాగన్‌ ఫ్యాక్టరీ వస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్ట్‌ ఫుల్‌ డిటైల్స్ ఒకసారి పరిశీలిద్దాం..

రాష్ట్ర విభజన హామీల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఒకటి. కానీ రోజులు గడుస్తున్న కోచ్ ఫ్యాక్టరీ మాత్రం రాలేదు. కానీ 2016 వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ నీ మంజూరు చేసింది కేంద్ర రైల్వే. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర బడ్జెట్‌లో కాజీపేటలో వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొనగా.. ఇందుకోసం రూ. 160 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే, కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుండా వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామనడంపై రాజకీయ దుమారం చెలరేగింది. దాంతో ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. కాజీపేట యూనిట్‌ను వాగన్‌ ఫ్యాక్టరీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యూనిట్‌ని 8వ తేదీన ప్రధాని మోడీ శంఖుస్థాపన చేయనున్నారు.

ఇక రైలు వ్యాగన్లు తయారు చేసేందుకు రైల్వేకు పశ్చిమ బెంగాల్‌‌లో మాత్రమే మాత్రమే సొంత యూనిట్‌ ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఇదొక్కటే ఉండగా.. ఇప్పుడు కాజీపేటలో రెండోది ఏర్పాటుకానుంది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్‌ తయారీ ఫ్యాక్టరీలో తొలి ఏడాది 1,200 వ్యాగన్లను తయారు చేస్తామని.. తర్వాత ఈ సామర్థ్యాన్ని 2,400కు పెంచుతామని రైల్వే అధికారులు వెల్లడించారు.

కాజీపేట సమీపంలోని అయోధ్య పురంలో 160 ఎకరాల స్థలంలో వ్యాగన్‌ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. మొదట ఇక్కడ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడా ప్రాజెక్టుతో పాటు వ్యాగన్‌ తయారీ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేశారు. 2025 నాటికి వ్యాగన్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అంటున్నారు అధికారులు. ఈ యూనిట్‌ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 4వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు అధికారులు. ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌ను, వ్యాగన్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేయడం వల్ల కొత్తగా మరికొన్ని యంత్ర పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్యాంగ్‌ డ్రిల్లింగ్‌ యంత్రం, షీరింగ్‌ యంత్రం, బెంచ్‌ ప్రెస్, యూనివర్సల్‌ అండర్‌ ఫ్రేమ్‌ వెల్డింగ్‌ మ్యానిప్యులేటర్స్, స్ట్రైటెనింగ్‌ యంత్రం, హుక్‌ బోల్టింగ్‌ వంటి యంత్రాలు వ్యాగన్ల ఉత్పత్తికి అవసరం అవుతాయి.

ఇండియన్ రైల్వే లో కోచ్‌లతో పాటు వ్యాగన్‌లకు డిమాండ్ ఉన్నందున, POHను వ్యాగన్ తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేయాలని రైల్వే నిర్ణయించింది. దేశంలో ఇప్పటికే చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నందున కాజీపేటలో వ్యాగాన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..