PM Narendra Modi: విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం!

విలక్షణ నటుడు కోట శ్రీనివాస్‌రావు మరణంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఆయన మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు. కోట శ్రీనివాస్‌రావు కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కోటా శ్రీనివాస్‌రావు మరణం బాధాకరమని ఆయన అన్నారు.

PM Narendra Modi: విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం!
Modi

Updated on: Jul 13, 2025 | 5:26 PM

విలక్షణ నటుడు కోట శ్రీనివాస్‌రావు మరణంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఆయన మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు. కోట శ్రీనివాస్‌రావు కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ కోటా శ్రీనివాస్‌రావు మరణంపై సంతాపం తెలిపారు. కోటా శ్రీనివాస్‌రావు మరణం చాలా బాధాకరమని అన్నారు.  ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారన్నారు. కోటా శ్రీనివాస్‌ రావు తన అద్భుతమైన నటనతో తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారని మోదీ అన్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ఎప్పుడూ ముందంజలో ఉన్నారని మోదీ తెలిపారు. పేద, అణగారిన వర్గాలకు సాధికారత కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని మోదీ తెలిపారు.

కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాస్ రావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాస్‌ రావు సుమారు 750కిపై సినిమాట్లో నటించాడు. ఆయన నటనకు గాను 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇదే కాకుండా ఆయనకు మరో 9 నంది అవార్డులు కూడా వచ్చాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.