మెదక్‌ జిల్లాలో ఆసక్తిగా మారిన ఆన్‌లైన్‌ పెళ్లి.. ఆన్‌లోనే మంత్రాలు చదివి పెళ్లి జరిపించిన పురోహితులు

|

May 05, 2021 | 1:29 PM

కరోనా మహమ్మారి రాకతో మనుషుల జీవన విధానంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, జూమ్‌ మీటింగ్‌ల...

మెదక్‌ జిల్లాలో ఆసక్తిగా మారిన ఆన్‌లైన్‌ పెళ్లి.. ఆన్‌లోనే మంత్రాలు చదివి పెళ్లి జరిపించిన పురోహితులు
Video Call Marriage
Follow us on

కరోనా మహమ్మారి రాకతో మనుషుల జీవన విధానంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, జూమ్‌ మీటింగ్‌ల ద్వారా సమావేశాలు నిర్వహించడం చూస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాల రివ్యూలు కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అయితే తాజాగా ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవడం ఆస‌క్తికరంగా మారింది మారింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తాండాలో జరిగిందీ వింత వివాహం. సోమ్లా తండాలో ముందుగా నిర్ణయించిన ప్రకారం ముహూర్తం సమాయానికి ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వేదికకు సమీపంలో కరోనా బారిన పడి వ్యక్తి చనిపోయాడు. వివాహ వేదికకు సమీపంలోనే కరోనా మృతదేహం ఉండడంతో వివాహం జరిపించడానికి బ్రాహ్మణులు నిరాకరించారు. దీంతో అమ్మాయి, అబ్బాయి తరపు వారు ఒక‌ అంగీకారానికి వచ్చి, పెండ్లి తంతు ముగించారు.

టేక్మాల్ మండలానికి చెందిన పాల్‌వోత్ హరిచంద్ కుమారుడు మోహన్‌కు సోమ్లా తాండాకు చెందిన బానోతు శివరాం కూతురు మంజులను ఇచ్చి వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. అందుకోసం వివాహ ముహూర్తం కూడా ఖరారు చేశారు. సరిగ్గా ముహూర్త సమయానికి తాండాలో పక్క వీధిలో కరోనాతో వ్యక్తి మృతి చెందాడు. పక్కవీధిలో కరోనా మృతదేహం ఉండగా పెళ్లి జరిపించలేనని వేద బ్రాహ్మణులు కరాఖండిగా చెప్పేశారు. దీంతో అమ్మాయి, అబ్బాయి తరపు వారు, వేద బ్రాహ్మణుడు ఒక అభిప్రాయానికి వచ్చారు.

పెళ్లి జరిపించే బ్రాహ్మణుడు దిగంబర శర్మ వీడియో కాల్ ద్వారా మంత్రోచ్చరణ చేయగా అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టేశాడు. అన్‌లైన్‌లో పంతులు మంత్రాలు చదువుతుండగా పెండ్లి పందిట్లో ముహూర్త సమయానికి పెళ్లి జరిపించారు. ఫోన్ లో వీడియో కాల్ వద్ద వైర్ లెస్ మైకు పెట్టుకుని వివాహం జరిపించారు. మారుమూల తండాలో జరిగిన ఈ ఆన్‌లైన్‌ పెళ్లి జిల్లాలో ఆస‌క్తికరంగా మారింది.

Also Read: తెలంగాణలో మే 5, 6 తేదీల్లో ఈదు‌రు‌గా‌లులు, వడ‌గం‌డ్లతో కూడిన వానలు

 రోదసిలో పులియబెట్టిన వైన్‌ బాటిల్ వేలం.. ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాంక్