Telangana: 108 ఆలస్యం.. ఆటోలోనే ప్రసవం

జనగామ జిల్లా లింగాల ఘనపురం నెల్లుట్ల గ్రామంలో ఓ గర్భిణి మహిళ ఆటోలోనే మగ బిడ్డకు ప్రసవం చేశారు. భర్త ఉపేంద్ర 108కు ఫోన్ చేసినప్పటికీ ఆలస్యం అవుతుందని సమాధానం ఇవ్వడంతో, రోడ్డు మధ్యలో ఆశా కార్యకర్తలు రావడం ద్వారా ఆటోలోనే ప్రసవం జరిగింది.

Telangana: 108 ఆలస్యం.. ఆటోలోనే ప్రసవం
Delivery In Auto

Updated on: Oct 12, 2025 | 1:46 PM

ఓ గర్భిణి మహిళలో ఆటోలోనే మ‌గ‌బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస‌వం కోసం ఆటోలో త‌ర‌లిస్తుండ‌గా మార్గమ‌ధ్యలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావ‌డంతో ఆశా వ‌ర్కర్లు ప్రస‌వం చేసి మ‌గ‌బిడ్డ ప్రాణాలు నిలిపారు. జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న‌పురం నెల్లుట్ల గ్రామంలో చోటు చేసుకుంది.

నెల్లుట్ల గ్రామానికి చెందిన క‌న‌క‌ల‌క్ష్మీకి పురిటి నొప్పులు రావడంతో… భ‌ర్త ఉపేంద‌ర్ 108కు ఫోన్ చేయ‌గా ఆల‌స్యం అవుతుందని స‌మాధానం ఇచ్చారు. దీంతో ఆటోలో జ‌న‌గామ ఎంసీహెచ్‌కు త‌ర‌లిస్తుండ‌గా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆశ వ‌ర్కర్లకు స‌మాచారం అందించారు. దీంతో రోడ్డుపైనే ఆటోను ఆపి గ‌ర్భిణికి డెలివరీ చేశారు. ఇంత‌లోనే 108కు అక్కడి చేరుకోవ‌డంతో చికిత్స కోసం జ‌న‌గామ ఎంసీహెచ్‌కు త‌ర‌లించారు. ఆశా కార్యకర్తల సమయస్ఫూర్తితో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.