Telangana: ‘నిర్ణయం ప్రకటించేది అప్పుడే’.. పార్టీ మార్పుపై పొంగులేటి, జూపల్లి క్లారిటీ.. పూర్తి వివరాలివే..

|

Jun 21, 2023 | 6:21 PM

Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో చర్చించిన ఆయన.. తన నిర్ణయాన్ని 24న లేదా 25న ప్రకటిస్తానని, వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక ..

Telangana: ‘నిర్ణయం ప్రకటించేది అప్పుడే’.. పార్టీ మార్పుపై పొంగులేటి, జూపల్లి క్లారిటీ.. పూర్తి వివరాలివే..
Telangana Congress
Follow us on

Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో చర్చించిన ఆయన.. తన నిర్ణయాన్ని 24న లేదా 25న ప్రకటిస్తానని, వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక ఉంటుందన్నారు. అయితే ఢిల్లీలోనో, హైదారాబాద్‌లోనో కాక ఖమ్మం నడిబొడ్డులోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరతానన్నారు. ఇంకా వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం మూడు అసెంబ్లీ స్థానలపై తన దృష్టి ఉందని, వాటిలో ఏదో ఒకదాని నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు.

ఇక అంతకముందు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ‘తెలంగాణ కోసం రాజీనామా చేసి పోరాటం చేశా. కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలని కేసీఆర్ అవమానిస్తున్నారు. స్కీమ్ తేవడం దాన్ని పక్కకి పెట్టి మరొక స్కీమ్ తేవడం కేసీఆర్‌కి అలవాటే. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ దేంట్లో ఆదర్శమో చెప్పాలి. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని బుజువు చేస్తాం. ఇక్కడ చూసిన అవినీతి పేరుకుపోయింది. కోట్ల రూపాయలు ఉంటే తప్పా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యమ సమయంలో లక్షకి ఐదు లక్షలకి ఇబ్బంది పడ్డ కేసీఆర్ దగ్గర ఇన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయి. బీఆర్ఎస్‌ని పాతర పెట్టాల’ని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇంకా ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందర్నీ కూడగట్టడానికే ఆలస్యం అవుతోంది. గొప్పగా పద్యాలు చదవడం కవిత్వం చెప్పడం కాదు. మాటల్లో నిజాయితీ ఎంత ఉందో చూడాలి. తెలంగాణ ప్రజలకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. తెలంగాణలో ఇప్పుడు జరగనున్న ఉద్యమంలో ప్రజలంతా భాగం అవ్వాల’ని పొంగులేటి రాష్ట్ర ప్రజలను కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..