Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మృగరాజుతోనే ఆటలా..! జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పిన సింహం.. వైరల్ అవుతున్న వీడియో..

Watch Video: అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాన్ చెప్పిన ‘సింహం పడుకుంది కదా అని జూలుతో జడెయ్యకూడదు రా!’అనే డైలాగ్ దాదాపుగా అందరికీ తెలిసిందే. అంటే పడుకున్న సింహంతో కూడా ప్రమాదమే అని. అదే, స్పృహతో ఉన్న సింహంతో ఆటలాడితే....

Watch Video: మృగరాజుతోనే ఆటలా..! జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పిన సింహం.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 20, 2023 | 9:20 PM

Watch Video: అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాన్ చెప్పిన ‘సింహం పడుకుంది కదా అని జూలుతో జడెయ్యకూడదు రా!’అనే డైలాగ్ దాదాపుగా అందరికీ తెలిసిందే. అంటే పడుకున్న సింహంతో కూడా ప్రమాదమే అని. అదే, స్పృహతో ఉన్న సింహంతో ఆటలాడితే.. ప్రాణాలకే ప్రమాదం. అయితే ఈ విషయాలను పెడచెవిన పెట్టిన ఓ యువకుడు సింహానికి చిక్కాడు. అంతేకాక ప్రస్తుతం నెటిజన్ల ముందు నవ్వుల పాలవుతున్నాడు.

ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలో ఏం జరిగిందంటే.. బంధించి ఉన్న సింహం ముందు ఓ కుర్రాడు దాన్ని ఆట పట్టిస్తూ దాని నోట్లో చేతులు పెట్టేలా ఆటలాడుతున్నాడు. అలా కొంత సమయం చేయగలిగాడు. కానీ ఒక్కసారిగా అతని వేళ్ళను పట్టేసుకుంది సదరు సింహం. అంతే నొప్పితో విలవిల్లాడుతూ విడిపించుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని క్షణాల్లోనే తప్పించుకున్నప్పటికీ.. అతని చేతి వేళ్లు సింహం నోట్లోనే ఉండిపోయాయనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

1000 WAYS TO DIE అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసిన ఈ వీడియోలో.. ఐడీ పేరుకి తగినట్లుగానే ఉంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘నువ్వు టార్జాన్ కాదురా’.., ‘సింహం నోట్లో అతని వేలు ఉంది, గమనించండి’.., ‘కుర్రాడికి ఇంకా లైఫ్ ఉంది, దురదృష్టం చేతి వేలి రూపంలో పోయింది’ అంటూ రాసుకొస్తున్నారు. జూన్ 19న షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.7 మిలియన్ల వీక్షణలు, 11 వేల లైకులు వచ్చాయి. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..