TG Polycet: తెలంగాణ పాలిసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు

జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. జులై 9వ తేదీ నుంచి ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. వీరికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. ఇంటర్నల్ స్లైడింగ్‌ కన్వీనర్ ద్వారా చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. జులై 24లోపు అన్ని...

TG Polycet: తెలంగాణ పాలిసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు
Tg Polycet 2024

Updated on: May 24, 2024 | 4:36 PM

తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వెబ్‌ ఆప్షన్స్‌ను నమోదు చేసుకున్న విద్యార్థులకు జూన్‌ 30వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. జులై 9వ తేదీ నుంచి ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. వీరికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. ఇంటర్నల్ స్లైడింగ్‌ కన్వీనర్ ద్వారా చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. జులై 24లోపు అన్ని సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.

ఇంజినీరింగ్ కౌన్సిల్‌ షెడ్యూల్ కూడా..

ఇదిలా ఉంటే తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిల్‌ షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ, జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. జులై 19న రెండో విడత కౌన్సెలింగ్, జులై 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30న ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్, ఆగస్ట్ 5న తుది విడత సీట్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..