Warangal TRS: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గరంగరంగా గులాబీ రాజకీయం.. షాకింగ్ కామెంట్స్ చేసుకున్న మాజీ డీసీఎంలు..!

|

Aug 30, 2022 | 7:09 PM

Warangal TRS: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గులాబీ రాజకీయం గరంగరంగా నడుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎంలు ఇద్దరు సై అంటే సై అంటున్నారు.

Warangal TRS: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గరంగరంగా గులాబీ రాజకీయం.. షాకింగ్ కామెంట్స్ చేసుకున్న మాజీ డీసీఎంలు..!
Rajaiah Vs Srihari
Follow us on

Warangal TRS: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గులాబీ రాజకీయం గరంగరంగా నడుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎంలు ఇద్దరు సై అంటే సై అంటున్నారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చాలానే చేసుకున్నారు. తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిల మధ్య రాజకీయ సంవాదం హైఓల్జేట్‌లో నడుస్తోంది.

తనపై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య. కడియం శ్రీహరి చీకటి బాగోతాలన్నీ తనకు తెలుసన్నారు. ఆయన గురించి టీడీపీ నేతలను అడిగితే తెలుస్తుందన్నారు. భార్యతో దెబ్బలు తిన్న ఆయనా తనపై విమర్శలు చేసేది అని వ్యాఖ్యానించారు. శ్రీహరికి అంత సమర్థత ఉంటే ఎమ్మెల్యే టిక్కెట్‌ తెచ్చుకోవాలని సవాల్‌ చేశారు రాజయ్య. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న ఆయన.. ముమ్మాటికీ స్టేషన్ ఘనపూర్ తన అడ్డానే అని ఉద్ఘాటించి చెప్పారు రాజయ్య. గతంలో, ఇప్పుడు ఎవరి ఆస్తులు ఏంటో అందరికీ తెలుసునని అన్నారు. శ్రీహరి ఎన్నో ఆరాచకాలు చేశారని, తస్మాత్ జాగ్రత్త అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకు ఓటేయాలని కనీసం ప్రచారం చేయలేదని శ్రీహరి తీరును తులనాడారు. పార్టీ ఫండ్‌ కూడా తినేశారని ఆరోపించారు. ‘ఘనపూర్‌ నా అడ్డానే, నా సొంత గడ్డ’ అని వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి గ్రూపులు కట్టారని ఆరోపించారు. సొంత సర్వేలు కాదని, అధిష్టానం చేసే సర్వేకు తాను సిద్ధం అని ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్యే రాజయ్య.

ఇదిలాఉంటే.. కడియం హయాంలోనే వందల ఎన్‌కౌంటర్లు జరిగాయంటూ నిన్న ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ఇవాళ స్పందించారు. ఆయన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా, సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరు ప్రజానాయకుడో తెల్చుకునేందుకు సర్వేకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. సిద్ధమైతే ఒకేనని, లేదంటే మళ్లీ తన గురించి మాట్లాడొద్దని హెచ్చరించారు. రాజయ్య చిలిపి, చిల్లర, తాగుడు వ్యవహారాలపై ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. రాజయ్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూనే.. ఆయన తీరును తప్పుబట్టారు కడియం శ్రీహరి. మతిస్థిమితం లేనట్లు రాజయ్య మాట్లాడారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..