Telangana: పీక్స్‌కి చేరిన ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్దం.. ఇళ్లిళ్లూ తిరుగుతానంటూ..

|

Feb 22, 2023 | 10:01 AM

పటాన్ చేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఎమ్మెల్యేను పాపాల రెడ్డి అంటూ మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తే.. మాజీ మంత్రి పుణ్యంతో బ్రతకలేదా అని ప్రశ్నించారు.

Telangana: పీక్స్‌కి చేరిన ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్దం.. ఇళ్లిళ్లూ తిరుగుతానంటూ..
Brs Vs Bjp
Follow us on

పటాన్ చేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఎమ్మెల్యేను పాపాల రెడ్డి అంటూ మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తే.. మాజీ మంత్రి పుణ్యంతో బ్రతకలేదా అని ప్రశ్నించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. పాపాల రెడ్డిగా మారారంటూ విమర్శించారు. 2014 ఎన్నికల్లో అఫిడవిట్ లో రూ. 2 కోట్లు చూపించిన ఎమ్మెల్యే ఇప్పుడు రూ. 2వేల కోట్లకు ఎదిగాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకు 20 నుంచి 30వేలు ఇచ్చి కొనాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ ముందస్తుకు రావాలని సవాల్ చేశారు. శివరాత్రి జాగరణ పేరుతో సినీ ఆర్టిస్టులతో హిందూ ధర్మాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. పాపాలరెడ్డి పై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్.

నందీశ్వర్ గౌడ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. 1987లో ఏ గుర్తింపు లేని మీకు మాజీ మంత్రి పి.రామచంద్ర రెడ్డి పుణ్యంతో బతికావని విమర్శించారు ఎమ్మెల్యే. ‘మీ ఆఫీసును మీరే తగలపెట్టించుకుని, నక్సలైట్ల దాడి జరిగిందని, నక్సలైట్ల హిట్ లిస్టులో వున్నానని నాటకాలాడి గన్ మెన్లను పెట్టుకోలేదా’ అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో నందీశ్వర్ గౌడ్‌కే టికెట్ ఇవ్వాలని బండి సంజయ్‌ని బ్రతిమిలాడుతానని, తనకు టికెట్ ఇవ్వకున్నా నందీశ్వర్‌ ఓటమికి ఇళ్లిళ్లు తిరుగుతానని చెప్పారు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి.

ఈ ఇద్దరి నేతల మాటల మంటలతో పటాన్‌చేరు నియోకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శలు ముందుముందు ఇంకా హీట్ పెంచే అవకాశం లేకపోలేదంటున్నారు స్తానికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..